logo

అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్‌

తెదేపా బాపట్ల లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్‌, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది.

Published : 24 Apr 2024 06:57 IST

నామపత్రాలు దాఖలు చేసిన లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు కృష్ణప్రసాద్‌, నరేంద్రవర్మ 
బాపట్లలో భారీ ప్రదర్శన

ఆర్వో శ్రీధర్‌కు నామినేషన్‌ పత్రం అందజేస్తున్న బాపట్ల అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మ

బాపట్ల, న్యూస్‌టుడే: తెదేపా బాపట్ల లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్‌, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. పిట్టలవానిపాలెం మండలం అల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తొలుత కుటుంబసభ్యులు, పార్టీ నేతలతో కలిసి వేగేశన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రచార వాహనంపై తెదేపా, జనసేన, భాజపా నేతలు, శ్రేణులతో కలిసి వాహనాల్లో ప్రదర్శనగా చందోలు బండ్లమ్మ ఆలయానికి వచ్చి పూజలు చేశారు. చందోలు నుంచి బాపట్లకు వందల సంఖ్యలో ద్విచక్రవాహనాలు, కార్లతో కర్లపాలెం, బాపట్ల మండలం మీదగా పట్టణంలోకి ప్రవేశించారు. బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి నిర్వహించిన రోడ్‌షోలో నరేంద్రవర్మతో లోక్‌సభ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ, భాజపా నేత అన్నం సతీష్‌ జత కలిశారు. అంబేడ్కర్‌ విగ్రహం వరకు రోడ్‌షో నిర్వహించి రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి పాదయాత్రగా పాతబస్టాండ్‌ కూడలికి వచ్చారు. దారి పొడవునా గ్రామాలు, బాపట్ల పట్టణంలో భారీ గజమాలలతో శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. కలెక్టరేట్లోని ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ పి.రంజిత్‌బాషాకు బాపట్ల లోక్‌సభ తెదేపా ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్‌ కూటమి నేతలతో కలిసి నామినేషన్‌ పత్రాన్ని అందజేశారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖరబాబు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకటశివనారాయణ ఉన్నారు. తహసీల్దారు కార్యాలయంలోని ఆర్వో కార్యాలయానికి మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌తో కలిసి వేగేశన వచ్చారు. రిటర్నింగ్‌ అధికారి, జేసీ చామకూరి శ్రీధర్‌కు సతీష్‌, తన కుమారుడు రాకేష్‌Ãతో కలిసి బాపట్ల అసెంబ్లీ తెదేపా అభ్యర్థి నరేంద్రవర్మ తన నామినేషన్‌ పత్రాన్ని అందజేశారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయప్రకాష్‌ నారాయణ, తెలుగు మహిళ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మానం విజేత, భాజపా జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీనారాయణ, పెద్ద సంఖ్యలో మూడు పార్టీల నేతలు పాల్గొన్నారు.

ఆర్వో రంజిత్‌బాషాకు నామినేషన్‌ పత్రం అందజేస్తున్న బాపట్ల లోక్‌సభ తెదేపా అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్‌

బాపట్ల పాత బస్టాండ్‌లో కూటమి శ్రేణుల కోలాహలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు