logo

పరీక్షలు ముగిసిన వారం రోజుల్లోనే.. ఇంజినీరింగ్‌ చివరి ఏడాది ఫలితాలు

జేఎన్‌టీయూ చరిత్రలో తొలిసారిగా రికార్డు సమయంలో ఇంజినీరింగ్‌ చివరి ఏడాది ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలు ముగిసిన వారం రోజుల్లోనే ఫలితాలను ప్రకటించారు. నాలుగో

Published : 15 Aug 2022 03:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూ చరిత్రలో తొలిసారిగా రికార్డు సమయంలో ఇంజినీరింగ్‌ చివరి ఏడాది ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలు ముగిసిన వారం రోజుల్లోనే ఫలితాలను ప్రకటించారు. నాలుగో ఏడాది రెండో సెమిస్టర్‌ పరీక్షలు గత నెల 22వ తేదీ నుంచి నిర్వహించారు. సప్లిమెంటరీ పరీక్షలతో కలుపుకొని ఈ నెల 6వ తేదీ వరకు జరిగాయి. సాధారణంగా ఏటా మూడు నుంచి నాలుగు వారాల సమయం తీసుకుని ఫలితాలను   ప్రకటించేవారు. ఈసారి ఏడు రోజుల్లో పత్రాల మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను శనివారం రాత్రి విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని