logo

YS Sharmila: ఎంత సహనంతో ఉన్నా మాపై వేధింపులు ఆగడం లేదు: వైఎస్‌ షర్మిల

తెలంగాణ పోలీసు వ్యవస్థ పూర్తిగా సీఎం కేసీఆర్‌ అధీనంలోకి వెళ్లిపోయిందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

Published : 14 Dec 2022 13:26 IST

హైదరాబాద్‌: తెలంగాణ పోలీసు వ్యవస్థ పూర్తిగా సీఎం కేసీఆర్‌ అధీనంలోకి వెళ్లిపోయిందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. తన ఆమరణ దీక్షను భగ్నం చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 

‘‘పోలీసుల భుజాన తుపాకీ పెట్టి నన్ను టార్గెట్‌ చేస్తున్నారు. వారిని కీలు బొమ్మల్లా వాడుకుంటున్నారు. ఎంత సహనంతో ఉన్నా మాపై వేధింపులు ఆగడం లేదు. లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ కోసం హైకోర్టు వెళ్లేందుకు న్యాయవాదితో బయల్దేరినా పోలీసులు అడ్డుకున్నారు. కుటుంబపరంగా ఉన్న పనులు చేసుకోవడానికీ అనుమతించడం లేదు. నా ప్రాథమిక హక్కులను హరిస్తున్నారు. ఏ అధికారంతో నన్ను కట్టడి చేస్తున్నారు? అందుకే పోలీసు శాఖపైనే కేసు వేయాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని షర్మిల తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని