logo

బాలుడిపై వీధి కుక్క దాడి

వీధికుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. మలక్‌పేట పరిధి మూసీ ఒడ్డున ఉన్న మూసానగర్‌కు చెందిన మహ్మద్‌ అస్లాం (10) తన ఇంటి సమీపంలో శుక్రవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్క వెంటపడి కరిచింది.

Published : 20 Mar 2023 02:27 IST

కట్టుతో అస్లాం

చంచల్‌గూడ, అక్బర్‌బాగ్‌: వీధికుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. మలక్‌పేట పరిధి మూసీ ఒడ్డున ఉన్న మూసానగర్‌కు చెందిన మహ్మద్‌ అస్లాం (10) తన ఇంటి సమీపంలో శుక్రవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్క వెంటపడి కరిచింది. దీంతో బాలుడి చేతికి తీవ్ర గాయమై రక్తస్రావం అయ్యింది. స్థానికులు అదిలించడంతో కుక్క పారిపోయింది. కుటుంబ సభ్యులు మహ్మద్‌ను వెంటనే నారాయణగూడలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. బాలుడి చేతికి కట్టుకట్టి వైద్యం చేశారు. ఈ సంఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల దాడులతో ప్రాణాలు పోతున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

చేతికి తీవ్రగాయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని