logo

దీర్ఘకాలిక క్షయ గుట్టురట్టు!

క్షయవ్యాధి (టీబీ) కొందరిలో మందులకు  లొంగడం లేదు. సరైన చికిత్స తీసుకోకపోవడం.. మధ్యలోనే ఔషధాలు మానేయడం వంటి కారణాలతో టీబీ నిరోధకత సంపాదిస్తోంది.

Published : 26 Mar 2023 02:04 IST

సీసీఎంబీతో సహా పలు సంస్థల అధ్యయనంలో వెల్లడి

పరిశోధకులు వినయ్‌కుమార్‌, సెబానాజ్‌

ఈనాడు, హైదరాబాద్‌: క్షయవ్యాధి (టీబీ) కొందరిలో మందులకు  లొంగడం లేదు. సరైన చికిత్స తీసుకోకపోవడం.. మధ్యలోనే ఔషధాలు మానేయడం వంటి కారణాలతో టీబీ నిరోధకత సంపాదిస్తోంది.  తాజా పరిశోధనలో డీఎన్‌ఏ రిపేర్‌ మెకానిజం రూపు మార్చుకోవడమే ఇందుకు కారణమని గుర్తించారు. సీసీఎంబీ, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యూనాలజీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జువాలజీ.. యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, సెంటర్‌ ఫర్‌ జెనెటిక్‌ మానిప్యులేషన్‌ ఆఫ్‌ క్రాప్‌ ప్లాంట్స్‌, యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ సౌత్‌ క్యాంపస్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మైక్రోబయాలజీ-సెల్‌ బయాలజీ, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ పరిశోధకుల బృందం సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టింది.

2,800 క్లినికల్‌ డాటా విశ్లేషణ.. టీబీ రోగుల నమూనాల నుంచి సేకరించిన బ్యాక్టీరియా జన్యుశ్రేణిని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. 2,800 క్లినికల్‌ డ్రగ్‌ సెన్సిబుల్‌, రెసిస్టెంట్‌ బ్యాక్టీరియా జాతుల జన్యు సంబంధిత డీఎన్‌ఏను విశ్లేషించారు. భారత్‌, రష్యా, చైనా, యూకే, ఉగాండా, నెదర్లాండ్స్‌ రోగుల నుంచి టీబీ జన్యు డేటా సేకరించారు. ఔషధ నిరోధకతతో సంబంధమున్న ఉత్పరివర్తనాలు గుర్తించారు. కణస్థాయి, జంతువుల్లోనూ పరిశోధనల అనంతరం డీఎన్‌ఏ రిపేర్‌ మెకానిజం రూపు మార్చుకోవడం ద్వారా డ్రగ్‌ రెసిస్టెన్స్‌ సంపాదిస్తోందని గుర్తించారు. అధ్యయనంలో డాక్టర్‌ వినయ్‌కుమార్‌ నందికూరి, సెబానాజ్‌, కుమార్‌ పరితోళస్‌, ప్రియదర్శిని సన్యాల్‌, సిద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని