logo

బీసీల చలో దిల్లీ విజయవంతం చేయాలి

చట్టసభలో బీసీల రిజర్వేషన్లు 52 శాతం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 3, 4వ తేదీల్లో చేపట్టనున్న చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు.

Published : 27 Mar 2023 01:32 IST

మాట్లాడుతున్న గుజ్జ సత్యం

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: చట్టసభలో బీసీల రిజర్వేషన్లు 52 శాతం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 3, 4వ తేదీల్లో చేపట్టనున్న చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. ఆదివారమిక్కడ ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని,  బీసీ క్రిమిలేయర్‌ ఎత్తివేయాలని దిల్లీలో భారీ నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ సహా తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి 5వేల మందికి పైగా తరలివస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ హాజరై బీసీ సమస్యలపై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.  బీసీ సంఘాల నేతలు డాక్టర్‌ పురుషోత్తం, సురేష్‌, బిళ్ల పండరినాథ్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు