logo

సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ

సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీ డైరెక్టర్‌ విమలారెడ్డి తెలిపారు.

Published : 28 Mar 2023 02:28 IST

కాచిగూడ, న్యూస్‌టుడే: సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీ డైరెక్టర్‌ విమలారెడ్డి తెలిపారు. ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేసిన వారు సైబర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌, సైబర్‌ సెక్యూరిటీ ఎథికల్‌ హ్యాకింగ్‌, సర్టిఫికెట్‌ ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ కోర్సులకు అర్హులని వివరించారు. ఏప్రిల్‌ 10లోపు వెబ్‌సైట్‌: www.nacsindia.org ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు: 78931 41797.


సాఫ్ట్‌వేర్‌లో రెడ్డీస్‌ ఫౌండేషన్‌ శిక్షణ

డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు సాఫ్ట్‌వేర్‌లో మూడు నెలలపాటు ఉచిత శిక్షణ అనంతరం ఉపాధి కల్పిస్తామని మేనేజర్‌ రాఘవేందర్‌రావు తెలిపారు. 20-28 ఏళ్ల మధ్య వయసు  ఉండి.. బీసీఏ, బీఎస్సీ(సీఎస్‌), బీటెక్‌ (సీఎస్సీ, ఈసీఈ, ఐటీ) పూర్తి చేసిన వారు శిక్షణకు అర్హులన్నారు. వివరాలకు: 83282 03807, 80190 50334.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు