logo

రూ.6 కోట్లతో కూడళ్ల సుందరీకరణ

నగరంలోని ఆరు చౌరస్తాలను రూ.6 కోట్లతో సుందరీకరించనున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ వెల్లడించారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో చేపట్టే పనులపై పరిశీలించారు. చౌరస్తాను సందర్శించిన ఆయన

Published : 23 Jan 2022 02:25 IST

ఖని చౌరస్తా వద్ద పరిశీలిస్తున్న ఎమ్మెల్యే చందర్‌

గోదావరిఖని, న్యూస్‌టుడే : నగరంలోని ఆరు చౌరస్తాలను రూ.6 కోట్లతో సుందరీకరించనున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ వెల్లడించారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో చేపట్టే పనులపై పరిశీలించారు. చౌరస్తాను సందర్శించిన ఆయన నగరంలోని చౌరస్తాతో పాటు తిలక్‌నగర్‌, రమేశ్‌నగర్‌, ఫైవింక్లైన్‌చౌరస్తా, రాజేశ్‌ థియేటర్‌, ఎఫ్‌సీఐ అడ్డరోడ్డు ప్రధాన కూడళ్లను సందరంగా మార్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. నగర మేయర్‌ అనిల్‌కుమార్‌తో పాటు కమిషనర్‌ సుమన్‌కుమార్‌లతో కలిసి కూడళ్లను పరిశీలించారు. ఇప్పటికే రూ.200 కోట్లతో నగరంలోని అన్ని డివిజన్‌లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నామన్నారు. జూన్‌ 2 నాటికి నగరంలోని అన్ని చౌరస్తాలను అందంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎమ్మెల్యే వెంట డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు భాస్కర్‌, శంకర్‌నాయక్‌, శంకర్‌, నాయకులు జె.వి.రాజు, జలపతి, నగరపాలక ఇంజినీర్‌ జమీల్‌, షాబాజ్‌, అర్కిటెక్ట్‌ గులామ్‌ ఉన్నారు.

గోదావరిఖని : ముస్లింలకు సంబంధించిన ఈద్గా, కబ్రాస్థాన్‌లకు సంబంధించిన స్థల పరిరక్షణకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ వెల్లడించారు. శనివారం స్థానిక ఫోరింక్లైన్‌ వద్ద ఉన్న ఈద్గా, కబ్రాస్థాన్‌ స్థలాన్ని జీఎం నారాయణతో కలిసి పరిశీలించారు. ఓసీపీ-5లో ఈద్గా, కబ్రాస్థాన్‌ స్థలం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని, ఏ ఒక్క సమాధిని కూడా తొలగించకుండా చుట్టూ కంచె ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ముస్లింలకు కేటాయించిన 11.25 ఎకరాల భూమికి బదులు మరోచోట కేటాయించేలా సింగరేణి ఛైర్మన్‌, సంచాలకులతో మాట్లాడుతానన్నారు. ముస్లిం మత పెద్దలు షర్ఫోద్దీన్‌, ఫసియోద్దీన్‌, అక్రమ్‌, సత్తార్‌ఖాన్‌, సిరాజ్‌, హమీద్‌, సర్వర్‌, సింగరేణి ఎస్టేట్‌ మేనేజర్‌ బాలసుబ్రహ్మణ్యం, కార్పొరేటర్‌ గట్టయ్య ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని