logo

దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

రామగుండం నగరపాలిక ఆధ్వర్యంలో ఈ సారి గతంలోకంటే వైభవంగా దసరా ఉత్సవాలను నిర్వహించాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కోరారు. రామగుండం నగరపాలక కార్యాలయంలో శనివారం నిర్వహించిన దసరా ఉత్సవాల సన్నాహక సమావేశంలో మాట్లాడారు.

Published : 02 Oct 2022 06:10 IST

సమావేశంలో ఎమ్మెల్యే చందర్‌, కమిషనర్‌ సుమన్‌రావు తదితరులు

గోదావరిఖని పట్టణం, న్యూస్‌టుడే : రామగుండం నగరపాలిక ఆధ్వర్యంలో ఈ సారి గతంలోకంటే వైభవంగా దసరా ఉత్సవాలను నిర్వహించాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కోరారు. రామగుండం నగరపాలక కార్యాలయంలో శనివారం నిర్వహించిన దసరా ఉత్సవాల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. స్థానిక పరిశ్రమలు, వివిధ విభాగాల సహకారంతో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. గుర్తింపు పొందిన స్థానిక కళాకారులతో పాటు ప్రతిభావంతులైన ఇతర ప్రాంతాల్లోని కళాకారులకు సైతం దసరా ఉత్సవాల్లో అవకాశమివ్వాలని చెప్పారు. దసరా ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఏర్పాట్లు చేయడంలో అన్నివర్గాల వారు సహకరించాలని కోరారు. కమిషనర్‌ బి.సుమన్‌రావు, డిప్యూటీ మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌కుమార్‌, డిప్యూటీ కమిషనర్‌ నారాయణరావు, సింగరేణి, ఎన్టీపీˆసీˆ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, పోలీసు అధికారులతో పాటు నగరపాలికలోని వివిధ విభాగాల అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని