logo

తండా వాసులకు రవాణా కష్టాలు

పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు, మండలాలు, పంచాయతీలు మార్చినప్పటికీ తండా వాసుల కష్టాలు తీరడంలేదు. ఇప్పటికీ కనీసం పూర్తి స్థాయిలో రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది.

Published : 03 Oct 2022 04:59 IST


బురద రహదారి

సారంగాపూర్‌, న్యూస్‌టుడే: పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు, మండలాలు, పంచాయతీలు మార్చినప్పటికీ తండా వాసుల కష్టాలు తీరడంలేదు. ఇప్పటికీ కనీసం పూర్తి స్థాయిలో రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. సారంగాపూర్‌ మండలంలోని మ్యాడారం తండా పంచాయతీ పరిధిలోని తలుపుగూడెం గిరిజనుల దుస్థితి. గతంలో రేచపల్లి పంచాయతీ పరిధిలో ఉండగా తండాలను పంచాయతీలుగా మార్చడంతో మ్యాడారం తండాను పంచాయతీగా మార్చారు. దీని పరిధిలోకి తలుపుల తండాలను కలపడంతో పంచాయతీ పరిధిలో 652 జనాభా కలిగి ఉండగా, తలుపుల గూడెం పరిధిలో 60 కుటుంబాలు, 250 మంది గిరిజనులు జీవిస్తున్నారు. వీరు నిత్యవసరాలకు రేచపల్లికి రావాలంటే కనీసం అయిదారు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దాదాపు తారు రహదారి నుంచి తండాకు వెళ్లాలంటే కనీసం మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. రహదారి మధ్య ఉన్న వంతెన తెగిపోయిన నెలలు గడుస్తున్నా.. మరమ్మతులు చేపట్టకపోవడంతో కాలినడకన కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అత్యవసరమైతే తండా నుంచి మ్యాడారం చేరుకుని అక్కడి నుంచి రేచపల్లికి చేరుకునే పరిస్థితి. ప్రస్తుత వర్షాలకు ఆ రహదారి కూడా పూర్తిగా గుంతలమయమై బురదతో గిరిజనులు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. తెగిపోయిన వంతెనకు మరమ్మతులు చేపట్టి, రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు వేడుకుంటున్నారు. 


వరదకు కొట్టుకుపోయిన వంతెన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని