logo

మూడు వృక్షాలు.. మృత్యుకుహరాలు

మానకొండూర్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో రహదారి పక్కన ఉన్న వృక్షాలు మృత్యుశాపాలుగా మారాయి. కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారికి ఆనుకొని మూడు వేప వృక్షాలు ఉన్నాయి.

Published : 09 Feb 2023 05:24 IST

మానకొండూర్‌లో ముగ్గురి మృతికి కారణమైన వృక్షం

న్యూస్‌టుడే, మానకొండూర్‌: మానకొండూర్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో రహదారి పక్కన ఉన్న వృక్షాలు మృత్యుశాపాలుగా మారాయి. కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారికి ఆనుకొని మూడు వేప వృక్షాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపుగా పెరగడంతో పలు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. రహదారిని ఆనుకొని ఉండడంతో పలు వాహనాలు ఢీకొట్టుతున్నాయి. రాత్రి వేళ వృక్షాలు కన్పించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రెండేళ్ల కాలంలో పది ప్రమాదాలు సంభవించాయని స్థానికులు తెలిపారు. సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించాల్సి ఉండగా అధికారులు పట్టించుకోవడం లేదు. గతేడాది కిత్రం వరంగల్‌ నుంచి కరీంనగర్‌కు వస్తున్న ఓ కారు కుడి పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో అందులోని ముగ్గురు దుర్మణం చెందారు. కర్రల లోడుతో వెళ్తున్న లారీ సైతం ఇదే చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్‌ వైపు బియ్యం లోడుతో వెళ్తున్న లారీ ఢీకొనడంతో డ్రైవర్‌, క్లీనర్‌ తీవ్రంగా గాయాలయ్యాయి. రెండు రోజుల క్రితం ఓ కారు హుజురాబాద్‌కు వెళ్తుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఓ సాఫ్ట్‌వేర్‌ తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. ప్రమాదకరంగా మారిన వృక్షాలను తొలగించాలని వాహన చోదకులు కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని