logo

నిబంధనల మేరకే సైలెన్సర్లు ఉండాలి

బులెట్, ఇతర ద్విచక్రవాహనాలకు శబ్దం కలిగించే సైలెన్సర్లు విక్రయించినా, బిగించినా కేసులు నమోదు చేస్తామని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎల్‌.సుబ్బారాయుడు హెచ్చరించారు.

Published : 21 Mar 2023 06:24 IST

వాహనదారులకు సీపీ స్పష్టీకరణ

సైలెన్సర్లను రోలర్‌తో తొక్కిస్తున్న సీపీ, పోలీసులు

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: బులెట్, ఇతర ద్విచక్రవాహనాలకు శబ్దం కలిగించే సైలెన్సర్లు విక్రయించినా, బిగించినా కేసులు నమోదు చేస్తామని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎల్‌.సుబ్బారాయుడు హెచ్చరించారు. సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో ఆటోమొబైల్‌ దుకాణాల యజయానులు, ద్విచక్రవాహనాల మెకానిక్‌లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం వాహనాల రూపురేకలు మార్చేందుకు అనుమతి లేదన్నారు. అదనపు సైలెన్సర్లు బిగించడం ద్వారా ఏర్పడుతున్న శబ్దకాలుష్యంతో అనేక మంది అనారోగ్యంపాలు కావడంతో పాటు విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టుబడిన 400 వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించారు. అదనపు డీసీపీ చంద్రమోహన్‌, ఏసీపీలు విజయ్‌కుమార్‌, ప్రతాప్‌, ఎస్బీఐ వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్లు తిరుమల్‌, నాగార్జునరావు, ఆర్‌ఐలు మల్లేశం, సురేష్‌, మురళీ ఏఎంవీఐ రజనీ ఉన్నారు.    


అసత్య ప్రచారాలు మానుకోవాలి

కరీంనగర్‌ నేరవార్తలు: వ్యక్తిగత అంశాలను సామాజిక మాధ్యమంలో పొందుపరిచి ప్రజల్లో విద్వేషాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ ఒక ప్రకటన ద్వారా హెచ్చరించారు. ఊహాజనితమైన పోస్టులు పెట్టడం కూడా నేరమని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలను మానుకోవాలని, తప్పుడు పోస్టులను వైరల్‌ చేయకూడదన్నారు. నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని