logo

నకిలీ ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దు

విదేశాల్లో ఉపాధి, ఉద్యోగాల కోసం వెళ్లే వారికి నకిలీ వీసాలు ఇచ్చి మోసాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అఖిల్‌మహాజన్‌ గల్ఫ్‌ ఏజెంట్లను హెచ్చరించారు.

Published : 30 Mar 2023 07:02 IST

ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: విదేశాల్లో ఉపాధి, ఉద్యోగాల కోసం వెళ్లే వారికి నకిలీ వీసాలు ఇచ్చి మోసాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అఖిల్‌మహాజన్‌ గల్ఫ్‌ ఏజెంట్లను హెచ్చరించారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాల నిమిత్తం విదేశాలకు వెళ్లేవారు నకిలీ ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దని, ప్రభుత్వ అనుమతి ఉన్న ఏజెన్సీలను ఆశ్రయించి ఉపాధి అవకాశాలను సద్వినియోగ పరచుకోవాలన్నారు. గల్ఫ్‌ ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారు ఎక్కువగా మోసాలకు గురవుతున్నారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు గల్ఫ్‌ ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులు, నకిలీ ఏజెంట్ల సమాచారం ఉన్నా స్పెషల్‌ బ్రాంచి సీఐ కరుణాకర్‌ చరవాణి నంబరు 8712656411లో సంప్రదించి పూర్తి వివరాలు తెలియజేయాలని సూచించారు. ఏజెంట్ల చేతిలో మోసపోతున్నామని అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ప్రజలను మోసం చేసే ఏజెన్సీల లైసెన్స్‌ రద్దు చేసి, క్రిమినల్‌ కేసులు నమోదు చేసి పీడీ యాక్టు పెడతామని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు