శత శాతం నేత్ర పరీక్షలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన కంటి వెలుగు కార్యక్రమం బుధవారం శత శాతంతో పూర్తయింది. జనవరి 19న జిల్లాలో వంద రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు
కరీంనగర్ పట్టణం, న్యూస్‌టుడే
కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన కంటి వెలుగు కార్యక్రమం బుధవారం శత శాతంతో పూర్తయింది. జనవరి 19న జిల్లాలో వంద రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సెలవు రోజులు కాకుండా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం ఈ కార్యక్రమంలో నిమగ్నమైంది.
జిల్లాలోని అన్ని పల్లెలు, పురపాలక సంస్థలు, నగర పాలక సంస్థల పరిధిలో అర్హులైన వారందరికీ పరీక్షలు నిర్వహించారు. దగ్గరి, దూరపు చూపు కంటి అద్దాలు పంపిణీ చేశారు. జిల్లా పాలనాధికారి ఆర్.వి.కర్ణన్‌తోపాటు జిల్లా అదనపు పాలనాధికారి గరిమ అగ్రవాల్ నిరంతర పర్యవేక్షణ చేశారు. ఈ శిబిరాల గురించి ప్రజలకు ముందస్తుగా సమాచారం కూడా ఇచ్చారు. 18 సంవత్సరాలు పైబడిన వారికి పరీక్షలు నిర్వహించారు. 29 వైద్య బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో, 19 బృందాలు పట్టణ ప్రాంతాల శిబిరాల్లో పాల్గొన్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు.
శస్త్రచికిత్సలు ఎప్పుడు?
శిబిరాల్లో శస్త్ర చికిత్సలకు అవసరమైన వారిని గుర్తించారు. వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. కానీ తేదీలు మాత్రం ఖరారు చేయలేదు. ఆపరేషన్లు ఎప్పుడు చేస్తారని బాధితులు ఎదురుచూస్తున్నారు.
లక్ష్యం చేరుకున్నాం
ప్రణాళిక ప్రకారం వంద రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేశాం. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాం. క్షేత్ర స్థాయి సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమైంది. ప్రజలు కూడా ఓపికతో సహకరించారు.
డాక్టర్ లలితాదేవి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Harmilan Bains: 13 ఏళ్ల వయసులోనే నిషేధం... ఆపై వరుస గాయాలు.. హర్మిలన్ పోరాటమిదీ!
-
Meta: మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు..!
-
Rajeshwari Kumari: అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయ... రజత పతకధారి రాజేశ్వరి కథ ఇదీ!
-
HarishRao: మాటలు చెప్పే సర్కార్ కావాలా? చేతల సర్కార్ కావాలా?: హరీశ్‌రావు
-
TDP: రోజా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందునే బుద్ధి చెప్పా: బండారు
-
Harsha Kumar: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరు: హర్షకుమార్