ఆలయ భూమిలో రహదారి నిర్మాణం
జగిత్యాల-గొల్లపల్లి రహదారిని ఆనుకొని ఉన్న దేవాదాయశాఖ ఆధీనంలోని శ్రీరామ మందిరం భూముల మీదుగా గతంలో రహదారులు నిర్మించారు.
జగిత్యాల-కరీంనగర్ రహదారిలో చేపట్టిన పనులు
న్యూస్‌టుడే, జగిత్యాల విద్యానగర్: జగిత్యాల-గొల్లపల్లి రహదారిని ఆనుకొని ఉన్న దేవాదాయశాఖ ఆధీనంలోని శ్రీరామ మందిరం భూముల మీదుగా గతంలో రహదారులు నిర్మించారు. మొత్తం భూమి 9 ఎకరాల వరకు ఉండగా ఇందులో ఎకరానికి పైగా భూమిలో దేవాదాయశాఖ అనుమతి లేకుండా రహదారి నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. 1992లో పొలాస-లక్ష్మిపూర్ రహదారి నిర్మాణం కోసం 1.18 ఎకరాల భూమిని దేవాదాయశాఖ నష్టపోగా ఇందుకోసం అప్పట్లో రూ.1.08 లక్షల పరిహారం ప్రభుత్వం చెల్లించింది. దీంతో పాటు జగిత్యాల-కరీంనగర్ రహదారిలో శ్రీరాజరాజేశ్వరస్వామి(ధర్మశాల) ఆలయానికి 11.22 ఎకరాల భూములు ఉన్నాయి. గతంలో ఈ భూముల మధ్యలో నుంచి ఎస్పారెస్సీ కెనాల్, రహదారి నిర్మాణం చేపట్టారు. దీంతో 171 సర్వే నంబరులోని 1.15 ఎకరాల భూమి దేవాదాయశాఖ కోల్పోయింది. ఎలాంటి పరిహారం అందకపోగా తాజాగా ఇదే కెనాల్‌ను మూసివేస్తూ ప్రభుత్వ రెండు వైపులా రహదారి నిర్మాణం చేపడుతోంది. దీంతో 15 నుంచి 20 గుంటలకు పైగా దేవాదాయశాఖ భూమి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ముందస్తుగా కోర్టు అనుమతి కానీ, భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారం చెల్లించకుండా చేపడుతున్న రహదారి నిర్మాణ పనులు నిలిపివేయాలని కోరుతూ దేవాదాయశాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌కు నివేదించారు.
ః దేవాలయాలకు చెందిన భూములను ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వినియోగించడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని దేవాదాయశాఖ అధికారులు రాష్ట్ర ఉన్నత స్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005లో రిట్ పిటిషన్ 11812 ద్వారా స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వం దేవాలయాలను ప్రజావసరాల కోసం వినియోగించాల్సిన పక్షంలో హైకోర్టులో తప్పనిసరిగా పిటిషన్ దాఖలు చేసి అనుమతి పొందిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని, దీంతో పాటు భూసేకరణ చట్టం-2013 ఆధారంగా పరిహారం చెల్లించాలని పేర్కొంది. వీటిని అనుసరించకపోవడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తేల్చిచెప్పింది.
కలెక్టర్‌కు నివేదించాం
- పణతులు వేణుగోపాల్, ఈవో, దేవాదాయశాఖ
జగిత్యాల పట్టణంలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం భూముల మధ్యలో నుంచి ఎస్సారెస్సీ కాలువ, రహదారి నిర్మాణం చేపట్టడంతో ఎకరానికి పైగా భూమి నష్టపోవడం, తాజాగా ఇదే కాలువకు రెండు వైపులా రహదారిని అభివృద్ధి చేస్తున్న అంశాన్ని జిల్లా కలెక్టర్‌కు నివేదించాం. నిబంధనల ప్రకారం భూసేకరణ జరిపి, దేవాదాయశాఖకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని నివేదికలో కోరాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్