logo

అక్కడ స్థానికేతరులే అధికం

1962లో ఆవిర్భవించిన పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లో స్థానికేతరులే గెలుపొందారు. 1980లో 7వ లోక్‌సభ ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన కోదాటి రాజలింగం మాత్రమే స్థానికుడు.

Updated : 18 Apr 2024 05:23 IST

న్యూస్‌టుడే, పెద్దపల్లి: 1962లో ఆవిర్భవించిన పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లో స్థానికేతరులే గెలుపొందారు. 1980లో 7వ లోక్‌సభ ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన కోదాటి రాజలింగం మాత్రమే స్థానికుడు. కర్ణాటకకు చెందిన ఎంఆర్‌ కృష్ణ 1962, 1967 ఎన్నికల్లో గెలుపొందారు. హైదరాబాద్‌కు చెందిన వి.తులసీరామ్‌ 1971, 1977లలో విజయం సాధించారు. మిగిలిన వారిలో గొట్టె భూపతి(1984) స్వస్థలం ముస్తాబాద్‌. 1989, 1991, 1996, 2004 ఎన్నికల్లో గెలిచిన గడ్డం వెంకటస్వామి, 2009లో గెలిచిన ఆయన తనయుడు వివేక్‌ వెంకటస్వామిల స్వస్థలం హైదరాబాద్‌. బాల్క సుమన్‌(2014)ది మెట్‌పల్లి. 2019లో గెలిచిన బొర్లకుంట వెంకటేశ్‌ నేత స్వస్థలం ఖానాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని జన్నారం. సుల్తానాబాద్‌ మండలం రేగడిమద్దికుంట గ్రామానికి చెందిన కోదాటి రాజలింగం సింగరేణి కార్మిక నాయకుడిగా గోదావరిఖని, బెల్లంపల్లి ప్రాంతాల్లో పని చేశారు. ఇక 1998, 1999లలో గెలిచిన డా.చలిమెల సుగుణకుమారి స్వస్థలం హైదరాబాద్‌ అయినా ఆమె భర్త మంథని ప్రాంతానికి చెందిన వారు కావడంతో కొంత అనుబంధం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని