logo

ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆధునిక వైద్య సేవలేవీ!

ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందుతున్న ధర్మపురి పట్టణంలో మెరుగైన వైద్యసేవలు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడి ముప్పై పడకల ఆసుపత్రిలో పది పడకల ఐసీయూ కేంద్రానికి మోక్షం కలగడం లేదు.

Published : 09 May 2024 04:59 IST

న్యూస్‌టుడే, ధర్మపురి

ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందుతున్న ధర్మపురి పట్టణంలో మెరుగైన వైద్యసేవలు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడి ముప్పై పడకల ఆసుపత్రిలో పది పడకల ఐసీయూ కేంద్రానికి మోక్షం కలగడం లేదు. ఈ ఆసుపత్రిలో అత్యవసర సేవల కోసం ఎలాంటి వసతులు లేవు. ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్‌, బీర్‌పూర్‌ మండలానికి చెందిన వందమంది రోగులు ఓపీ సేవలు పొందుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు. జాతీయ రహదారి కావడంతో రాత్రిళ్లు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 108 వాహనం ద్వారా జగిత్యాల ఏరియా, ఇతర ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలిస్తున్నారు. అత్యవసర సేవలు అందక ఎంతోమంది ప్రాణాలు విడిచిన ఘటనలు ఉన్నాయి. ధర్మపురిలో అత్యవసర వైద్య సేవలందించాలంటే ఐసీయూ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని భావించి అప్పట్లో రూ.కోటి నిధులు మంజూరు చేశారు. ఈ కేంద్రంలో పది ఐసీయూ పడకలు ఏర్పాటు చేస్తున్నారు. పడకలతో పాటు,  అత్యాధునిక పరికరాలు రావాల్సి ఉంది. అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకుని రావాలని స్థానికులు కోరుతున్నారు.


ఎన్నికల తర్వాత ఏర్పాటుకు చర్యలు

-శ్రీకాంత్‌, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌, ధర్మపురి ఆసుపత్రి

ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు బీరువాలు, యంత్రాలు వచ్చాయి. మిగతా పరికరాలు ఎన్నికల తర్వాత వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమిస్తారు. ఎన్నికల తర్వాత ప్రక్రియ ప్రారంభమవుతుందని భావిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని