logo

జలదిగ్బంధంలో స్మారకాలు

హంపీలోని స్మారకాలు మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తుంగభద్ర జలాశయం నుంచి 1.30 లక్షల క్యూసెక్కులదాకా నీటిని నదికి విడుదల చేయడంతో హంపీ సమీపంలో తుంగభద్ర నది ఉగ్రరూపం దాల్చింది. ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రముఖ

Published : 10 Aug 2022 02:40 IST

జలదిగ్బంధంలో హంపీలోని మంటపాలు

హొసపేటె: హంపీలోని స్మారకాలు మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తుంగభద్ర జలాశయం నుంచి 1.30 లక్షల క్యూసెక్కులదాకా నీటిని నదికి విడుదల చేయడంతో హంపీ సమీపంలో తుంగభద్ర నది ఉగ్రరూపం దాల్చింది. ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రముఖ స్మారాలను చుట్టేసింది. ఇప్పటికీ నది తీరంలోని పిండ ప్రదాన మండపం, పురందరదాస మండపం, స్నానఘట్టాలు పూర్తిగా మునిగిపోయాయి. చక్రతీర్థ కోదండ రామాలయం మెట్లదాకా వరద నీరు వచ్చి చేరింది. సాలు మంటపాలు కూడా జలావృతమయ్యాయి. ఎదురు బసవణ్ణ ఆలయం నుంచి కోదండ రామాలయం, యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్లే మార్గాలు పూర్తిగా జలావృతమయ్యాయి. భక్తులు అటువైపు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నారు. బుధవారం ఉదయానికల్లా తుంగభద్ర జలాశయం నుంచి సుమారు 2లక్షల క్యూసెక్కులదాకా విడుదల చేసే అవకాశం ఉన్నందున హంపీ పోలీస్‌స్టేషన్‌ ఎదురు బసవణ్ణ ఆలయాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. స్మారకాలు ఇలా ముంపునకు గురవడం నెలరోజుల్లో రెండో సారి.


హంపీలోని రామలక్ష్మల ఆలయం మెట్లను తాకిన తుంగభద్రమ్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని