logo

అప్రమత్తంగా ఉండండి

తుంగభద్ర వరద ఉద్ధృతి పెరగడంతో బుధవారం సాయంత్రం కంప్లి కోటె ప్రాంతంలోని మత్స్యకారుల ఇళ్లల్లోకి నీరు చేరింది. కొన్ని కుటుంబాలు బంధువుల ఇళ్లకు వెళ్లగా మరికొన్ని కుటుంబాలు పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో

Published : 12 Aug 2022 01:18 IST

తుంగభద్ర తీరంలోని కోటె ప్రజలతో మాట్లాడుతున్న శాసనసభ్యుడు గణేశ్‌

కంప్లి, న్యూస్‌టుడే: తుంగభద్ర వరద ఉద్ధృతి పెరగడంతో బుధవారం సాయంత్రం కంప్లి కోటె ప్రాంతంలోని మత్స్యకారుల ఇళ్లల్లోకి నీరు చేరింది. కొన్ని కుటుంబాలు బంధువుల ఇళ్లకు వెళ్లగా మరికొన్ని కుటుంబాలు పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకున్నాయి. విషయం తెలిసి రాత్రి శాసనసభ్యుడు గణేశ్‌ కోటెకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వరద నీరు చేరిన ఇళ్లకు వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఏటా వరద వచ్చినప్పుడల్లా ఇబ్బంది పడేకన్నా శాశ్వతంగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తే బాగుంటుంది. వరద నీటితో పాటు విషపురుగులు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలతో పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి భోజనం చేశారా అని అడిగి తెలుసుకున్నారు. వరద ప్రవాహం తగ్గే వరకు ఇక్కడి కుటుంబాలకు భోజనం ఏర్పాటు చేయాలని చరవాణిలో తహసీల్దార్‌కు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని