logo

అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ

ప్రజల్లో అవగాహనతోనే ఎయిడ్స్‌పై నియంత్రణ సాధించవచ్చని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హర్షల్‌ బోయర్‌ పేర్కొన్నారు.

Published : 02 Dec 2022 01:22 IST

జెండా ఊపి ఎయిడ్స్‌ జాగృతి ర్యాలీని ప్రారంభిస్తున్న నగరసభ అధ్యక్షురాలు సుంకమ్మ, డీహెచ్‌వో డాక్టర్‌ సలీం

హొసపేటె, న్యూస్‌టుడే: ప్రజల్లో అవగాహనతోనే ఎయిడ్స్‌పై నియంత్రణ సాధించవచ్చని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హర్షల్‌ బోయర్‌ పేర్కొన్నారు. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన ఎయిడ్స్‌ జాగృతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏ వ్యాధి అయినప్పటికీ దానిపై అవగాహన ఉన్నవారు చాలా జాగ్రత్తలు పాటిస్తారని స్పష్టం చేశారు. ఎయిడ్స్‌ వ్యాధి వచ్చిన తరువాత చికిత్స ఇవ్వడం ఎంత ముఖ్యమో రాకుండా ప్రజల్లో వ్యాధిపట్ల అవగాహన కల్పించడం చాలా అవసరమన్నారు. ఇప్పటికే అవగాహనతో జిల్లాలో ఎయిడ్స్‌ బాధితుల సంఖ్య విపరీతంగా తగ్గింది. పూర్తిగా నిర్మూలన చేసేవరకు వైద్యశాఖ విశ్రమించకూడదన్నారు. తరచూ ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక ఉపన్యాసాలు, వీధినాటకాల ద్వారా ప్రజల్లో అవగాహన, జాగృతి తీసుకురావాలని ఆయన సూచించారు.నగరసభ అధ్యక్షురాలు సుంకమ్మ ర్యాలీని ప్రారంభించారు. జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్‌ సలీం, వైద్యాధికారులు భాస్కర్‌, షణ్ముఖ నాయక్‌, జంబయ్య, శంకర్‌ నాయక్‌, కమలమ్మ, ఎం.పి.దొడ్డమని, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీధినాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని