logo

భాజపాను బలపరుద్దాం

మాదిగ సముదాయ ప్రజలందరం భాజపాను బలపరుద్దామని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. చెళ్లకెర వాసవీ కల్యాణ మంటపంలో బుధవారం జరిగిన మాదిగ సముదాయ సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 18 Apr 2024 02:47 IST

ఎమార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

మొక్కకు నీరు పోసి సమావేశాన్ని ప్రారంభిస్తున్న నాయకులు

చెళ్లకెర, న్యూస్‌టుడే: మాదిగ సముదాయ ప్రజలందరం భాజపాను బలపరుద్దామని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. చెళ్లకెర వాసవీ కల్యాణ మంటపంలో బుధవారం జరిగిన మాదిగ సముదాయ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో భాజపాను మరోసారి గెలిపిస్తే దళిత వర్గీకరణ అమలవుతుంది. ఫలితంగా మాదిగలకు ఆర్థికంగా అన్ని విధాలా ఉపయోగపడుతుందన్నారు. 2004 నుంచి పదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా చలవాది వర్గాల అనుకూలం కోసం మల్లికార్జున ఖర్గే వర్గీకరణను అడ్డుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో అగ్ర వర్ణాల వారు రాష్ట్రపతులు కాగా భాజపా హయాంలో దళితులు, గిరిజనులకు అవకాశం కల్పించారు. దళిత నాయకుడు బంగారు లక్ష్మణ్‌ను భాజపా జాతీయ అధ్యక్షుడిగా నియమించింది. దళితులకు విరోధి ఎవరో ఆలోచించి ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో చిత్రదుర్గ భాజపా అభ్యర్థి గోవింద కారజోళకు ఓటేయాలన్నారు. భాజపా ముస్లింలకు వ్యతిరేకి అని తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏమాత్రం అర్థం లేదు. తలాక్‌ను రద్దు చేసి ముస్లిం సోదరీమణులకు మంచి చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ గెలిస్తే దేశాన్ని కొల్లగొడుతుందన్నారు. విధాన పరిషత్‌ సభ్యుడు రవి కుమార్‌, భాజపా, జేడీఎస్‌ నాయకులు, మాదిగ సముదాయ ప్రజలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని