logo

రాష్ట్రంలో అధికార దుర్వినియోగం: అశోక్‌

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారాన్ని దురుపయోగపరుస్తోందని విపక్ష నేత ఆర్‌.అశోక్‌ ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన నిబంధనలను ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించిందని గుర్తు చేశారు.

Published : 24 Apr 2024 05:53 IST

విలేకరులతో మాట్లాడుతున్న ఆర్‌ అశోక్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారాన్ని దురుపయోగపరుస్తోందని విపక్ష నేత ఆర్‌.అశోక్‌ ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన నిబంధనలను ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించిందని గుర్తు చేశారు.

కర్ణాటకలో మాత్రం విధానసౌధను కాంగ్రెస్‌ కార్యాలయంగా మార్చేశారని దుయ్యబట్టారు. పార్టీ నాయకులు రాజీవ్‌, రమేశ్‌గౌడ, అఖండ శ్రీనివాస్‌ తదితరులతో కలిసి మంగళవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల నియమావళి జారీలో ఉన్న సమయంలో విధానసౌధ ఆవరణలో కాంగ్రెస్‌ నేతలు ధర్నాకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై తాము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. నియమావళి అమలులోకి వచ్చిన అనంతరం పలు సందర్భాల్లో విధానసౌధలో కాంగ్రెస్‌ తన వ్యక్తిగత కార్యక్రమాలను నిర్వహించుకుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని