logo
Published : 22 Jan 2022 04:51 IST

‘పురపాలకాల్లో అభివృద్ధి పనులు వేగిరం’

సమీక్షిస్తున్న కలెక్టర్‌ అనుదీప్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి మున్సిపల్‌ ఛైర్మన్లు, కమిషనర్లు, డీఈలు, ప్రజారోగ్య శాఖ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఫిబ్రవరి 1 నాటికి ఇంటింటి చెత్త సేకరణ వందశాతం జరిగేలా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రస్తుతం కొత్తగూడెంలో 67, ఇల్లెందులో 95, పాల్వంచలో 76, మణుగూరులో 40 శాతం ఇళ్ల నుంచి మాత్రమే నేరుగా చేత్త సేకరణ చేపడుతున్నారన్నారు. తడి చెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారు చేయాలని, టెట్రా వర్మీ బెడ్ల ఏర్పాటులో వేగం పెరగాలని అన్నారు. కొత్తగూడెం రాజీవ్‌ పార్క్‌ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమీకృత మార్కెట్‌ సముదాయాల పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. వైకుంఠధామాల్లో నీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లో క్రీడా ప్రోత్సాహంలో భాగంగా ఇండోర్‌ షటిల్‌ కోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేయాలన్నారు. పాల్వంచ సెంట్రల్‌ లైటింగ్‌ పనుల్లో జాప్యానికి కారణమైన గుత్తేదారుతో కాంట్రాక్టు రద్దు చేయాలని కమిషనర్‌ని ఆదేశించారు. గ్రంథాలయ నిర్మాణ డిజైన్‌ పూర్తిచేసి నివేదిక అందించాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, సకాలంలో వేతనాలు చెల్లించాలని సూచించారు. ‘ఈ-శ్రమ’ పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఇల్లెందు పురపాలక ఛైర్మన్‌ డి.వెంకటేశ్వర్లు, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు కమిషనర్లు సంపత్‌కుమార్‌, శ్రీకాంత్‌, అంజన్‌కుమార్‌, నాగప్రసాద్‌, డీఈలు నవీన్‌, మురళి, ప్రజారోగ్య శాఖ డీఈ నవీన్‌ పాల్గొన్నారు.

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని