logo

రవాణాకు రైలు మార్గం.. బొగ్గు ఉత్పత్తిలో వేగం

సింగరేణి విస్తరించి ఉన్న మిగిలిన ఏరియాల్లోని గనులకన్నా ఖమ్మం జిల్లాలోని ఓసీల నుంచే అధిక మొత్తంలో బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఈ ఏరియాలోని పలు ఓసీల్లో ఇటీవల వరకు ఉత్పత్తి రవాణాకు రోడ్డు మార్గంపైనే

Updated : 12 Aug 2022 05:43 IST

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: సింగరేణి విస్తరించి ఉన్న మిగిలిన ఏరియాల్లోని గనులకన్నా ఖమ్మం జిల్లాలోని ఓసీల నుంచే అధిక మొత్తంలో బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఈ ఏరియాలోని పలు ఓసీల్లో ఇటీవల వరకు ఉత్పత్తి రవాణాకు రోడ్డు మార్గంపైనే ఆధారపడాల్సి వచ్చింది. దీంతో తవ్వకాలు పూర్తిస్థాయిలో జరపలేదు. ప్రస్తుతం ఓ రైలుమార్గం ఏర్పాటు కావడంతో భారీగా బొగ్గు వెలికితీత చేపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వార్షిక సంవత్సరం ఖమ్మం జిల్లాలోని గనులకు భారీ లక్ష్యాన్ని నిర్ణయించారు.

ఉభయ జిల్లాల్లో విస్తరించి ఉన్న కొత్తగూడెం ఏరియాకు ఈ ఉత్పత్తి సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని 151 లక్షల టన్నులుగా నిర్ణయించగా.. అందులో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవీఆర్‌ ఓసీ-2, కిష్టారం ఓసీలకు సింహభాగం కేటాయించారు. ఈ రెండు గనుల నుంచి గత సంవత్సరం 93.50 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది దీన్ని ఏకంగా 120 లక్షల టన్నులకు యాజమాన్యం పెంచింది. సత్తుపల్లికి రైలుమార్గం ఏర్పడినందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. కిష్టారంలో ఉత్పత్తి నామమాత్రం కాగా జేవీఆర్‌ నుంచే ఏకంగా 100 లక్షల టన్నుల బొగ్గు వెలికితీయనున్నారు. కొత్తగూడెం ఏరియా జీఎం సీ.హెచ్‌.నర్సింహారావు మాట్లాడుతూ... ‘సత్తుపల్లి రైలుమార్గం ప్రారంభం అయింది. దీంతో రవాణాకు మరింత వెసులుబాటు కలిగింది. భారీ మొత్తంలో ఉత్పత్తి దిశగా చర్యలు ముమ్మరం చేశాం. జేబీఆర్‌ ఓసీ నుంచి 100 టన్నుల లక్ష్యం చేరుకుంటా’మని అన్నారు.  

* గని: జలగం వెంగళరావు ఓసీ-2

* మొత్తం నిక్షేపాలు: 293 మిలియన్‌ టన్నులు

* కాలపరిమితి: 29 సంవత్సరాలు

* ఈ ఏడాది ఉత్పత్తి లక్ష్యం: 100 లక్షల టన్నులు

* గతేడాది సాధించిన లక్ష్యం: 93.50 లక్షల టన్నులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని