logo

విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించొద్దు: ఎస్పీ

కేటాయించిన విధులను పోలీసు సిబ్బంది సమర్థంగా నిర్వర్తించాలని ఎస్పీ వినీత్‌ స్పష్టం చేశారు.

Published : 29 Jan 2023 03:08 IST

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: కేటాయించిన విధులను పోలీసు సిబ్బంది సమర్థంగా నిర్వర్తించాలని ఎస్పీ వినీత్‌ స్పష్టం చేశారు. వర్టికల్‌ ఇన్‌ఛార్జిలతో కొత్తగూడెంలోని తన కార్యాలయంలో శనివారం సమీక్ష జరిపారు. వివిధ సమస్యలతో ఠాణాలకు వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందని భరోసా కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తు చేశారు. పోలీసు శాఖలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వర్టికల్స్‌ వారీగా నిర్వర్తించే విధులకు సంబంధించి ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సూచించారు. రిసెప్షన్‌, బ్లూ కోల్ట్స్‌, కోర్టు ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌, ఎస్‌హెచ్‌ఓ, ఇతర విభాగాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించకూడదన్నారు. సమావేశంలో సీఐలు రాజగోపాల్‌, రమాకాంత్‌, సత్యనారాయణ, వసంత్‌కుమార్‌, అబ్బయ్య, ఉపేందర్‌, నాగరాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు