logo

టీకాలతో వ్యాధుల నుంచి రక్షణ

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నిత్యం ఎంతో మంది పిల్లలు జన్మిస్తున్నారు. నవజాత శిశువు రోగాల బారిన పడకుండా ఉండాలంటే వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి.

Updated : 05 Feb 2023 05:26 IST

పుట్టిన చిన్నారులందరికీ తప్పనిసరి

జిల్లా ఆస్పత్రిలో చిన్నారికి టీకా వేస్తున్న సిబ్బంది

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నిత్యం ఎంతో మంది పిల్లలు జన్మిస్తున్నారు. నవజాత శిశువు రోగాల బారిన పడకుండా ఉండాలంటే వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి. పుట్టిన బిడ్డ నుంచి 16 ఏళ్ల వయసు వచ్చే వరకు పలు విడతలుగా ప్రభుత్వం ఉచితంగానే టీకాలు పంపిణీ చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి. బీసీజీ నుంచి టీడీ వరకు అన్ని రకాల టీకాలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో వంద శాతం లక్ష్యాలను చేరుకోవాలంటే తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ నిర్దేశించిన కాలమానిని ప్రకారం టీకాలు వేయించాల్సిన అవసరం ఉంది. ఒకసారి జిల్లాలో గత ఏడాది పంపిణీ ప్రక్రియ సాగిన తీరును పరిశీలిస్తే...

పంపిణీ కేంద్రాలు ఇక్కడే..

ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలో ప్రత్యేక కార్యాచరణ ద్వారా వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో ప్రతిరోజు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. సీహెచ్‌సీ, ప్రాథమిక, ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో బుధ, శనివారాల్లో నిర్దేశిత శిబిరాల్లో టీకాలు అందిస్తారు.


పుట్టినప్పటి నుంచి 16 ఏళ్లు వచ్చే వరకు..

పిల్లలు జన్మించిన వెంటనే బీసీజీ(బాసిల్లె క్లామెట్టీ గ్యూరిన్‌), ఓపీవీ(ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌), హెపటైటిస్‌-బీ టీకాలు వేయించాలి. ఆరు, పది, 14 వారాలకు పెంటావాలెంట్ వ్యాక్సిన్‌(పెంటా1, 2, 3), ఓపీవీ(1,2,3), ఐపీవీ(ఇన్‌ ఆక్టివేటెడ్‌ పోలియో వ్యాక్సిన్‌ 1, 2, 3), ఆర్‌వీవీ(రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ 1, 2, 3), పీసీవీ(నిమోకోకల్‌ కంజుగేట్‌ వ్యాక్సిన్‌ 1, 2), తొమ్మిది నెలలకు ఎంఆర్‌ (మీజిల్స్‌, తట్టు-1), జేఈ(జపనీస్‌ ఎన్‌సీఫాలిటిక్స్‌ వ్యాక్సిన్‌-1), విటమిన్‌ ఏ, పీసీవీ బూస్టర్‌, 16 నుంచి 24 నెలల మధ్య డీపీటీ(డిప్తీరియా, పెర్టుసిస్‌, టెటనస్‌) బూస్టర్‌, ఓపీవీ బూస్టర్‌, ఎంఆర్‌-2, జీఈ-1, విటమిన్‌ ఏ, 5 నుంచి 6 ఏళ్ల పిల్లలకు డీపీటీ బూస్టర్‌-2, 10 నుంచి 16 సంత్సరాల పిల్లలకు టీడీ(టెటనస్‌, డిప్తీరియా) టీకాలు కచ్చితంగా వేయించాలి. సకాలంలో అన్ని రకాల టీకాలను చిన్నారులకు ఇప్పించడం వల్ల 12 ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని