logo

Puvvada Ajay: కేసీఆర్‌ను దించితే నష్టపోయేది మనమే: మంత్రి పువ్వాడ

కేసీఆర్‌ను దించితే నష్టపోయేది మనమే.. ఇప్పుడు అమలు చేసే సంక్షేమ పథకాలు అన్ని నిలిచిపోయే ప్రమాదముంది

Updated : 07 May 2023 08:27 IST

ఖమ్మం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ‘కేసీఆర్‌ను దించితే నష్టపోయేది మనమే.. ఇప్పుడు అమలు చేసే సంక్షేమ పథకాలు అన్ని నిలిచిపోయే ప్రమాదముంది.. ఎవరికో కడుపునొప్పి వచ్చిందని.. మనం తలనొప్పి తెచ్చుకోలేం కదా.. విజ్ఞతతో ఓటు వేసి మరోసారి సీఎంగా కేసీఆర్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని’ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఖమ్మం నగరంలో రూ.180 కోట్లతో కేబుల్‌ బ్రిడ్జి మంజూరు చేయడాన్ని ఎవరైనా ఊహించారా అని మంత్రి ప్రశ్నించారు. జీవో నెం.58 ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టా ఇవ్వడంతో పాటు, ఖాళీ స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 5 వేల దరఖాస్తులు వచ్చాయని, మరిన్ని వచ్చే అవకాశమున్న దృష్ట్యా వాటన్నింటిని మానవత దృక్పథంతో పరిశీలించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని