logo

Fancy Numbers: టీజీ.. భలే క్రేజీ..!

కాంగ్రెస్‌ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌, సిరీస్‌లు మార్చేసింది. గత ప్రభుత్వ హయాంలో ‘‘టీఎస్‌’’తో కొనసాగిన వాహనాల రిజిస్ట్రేషన్లు ఈ నెల 15 నుంచి ‘‘టీజీ’’ కోడ్‌తో జరుగుతున్నాయి.

Updated : 27 Mar 2024 08:31 IST

ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌, సిరీస్‌లు మార్చేసింది. గత ప్రభుత్వ హయాంలో ‘‘టీఎస్‌’’తో కొనసాగిన వాహనాల రిజిస్ట్రేషన్లు ఈ నెల 15 నుంచి ‘‘టీజీ’’ కోడ్‌తో జరుగుతున్నాయి. టీజీ కోడ్‌తో పాటు ప్రతి జిల్లాలో మొదటి 10వేల నంబర్ల వరకు ‘‘ఏబీ’’ వంటి సిరీస్‌ లేకుండా నేరుగా సంఖ్య కేటాయిస్తున్నారు (ఉదాహరణ: ఖమ్మం జిల్లా కోడ్‌తో టీజీ 04 0001). ఈ నేపథ్యంలో వాహనదారులు టీజీ కోడ్‌తో ఫ్యాన్సీ నంబర్‌ పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. తద్వారా రవాణా శాఖకు ఆదాయం పెరిగింది. ఖమ్మం, వైరా, సత్తుపల్లి ఆర్టీఏ కార్యాలయాల్లో ఫ్యాన్సీ నంబర్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గత పది రోజుల వ్యవధిలో జిల్లాకు రూ.14,94,602 ఆదాయం సమకూరినట్లు రవాణా శాఖ లెక్కలు చెబుతున్నాయి.


వాహనదారుల ఆసక్తి

ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకునేందుకు వాహనాదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇతర ముఖ్య తేదీలు వాహనం నంబర్‌గా వచ్చేలా వేలం పాడుతున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి టీజీ కోడ్‌, సిరీస్‌ అమల్లోకి వచ్చిన ఈనెల 15 (తొలిరోజు)న జిల్లా రవాణా శాఖకు రూ.6,07,965 ఆదాయం సమకూరింది. ఖమ్మం నగరానికి చెందిన తోట లక్ష్మీభార్గవి తన కారుకు టీజీ04 0999 నంబర్‌ను రూ.2,21,000 దక్కించుకున్నారు. 0999 నంబర్‌ ప్రారంభ ధర రూ.50వేలు మాత్రమే. ఎస్‌ఎస్‌ఆర్‌పీఎస్‌ డెవలపర్స్‌ లిమిటెడ్‌ కంపెనీ యజమాని టీజీ04 1111 నంబర్‌ను ఈనెల 19న రూ.4,54,567కు దక్కించుకున్నారు. ఈ నంబర్‌ ప్రారంభ ధర రూ.20వేలే.


ప్రభుత్వం ఈ నెల 15 నుంచి టీజీ కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్‌ చేసేలా ఉత్తర్వులు వెలువరించింది. నూతన కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్‌కు వాహనదారులు ఆసక్తి చూపుతున్నారు. రవాణా శాఖకు మంచి ఆదాయం సమకూరింది.

అఫ్రిన్‌ సిద్ధిఖీ, జిల్లా రవాణా శాఖాధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని