logo

కుటుంబ సభ్యులకు బిహార్‌ యువకుడి అప్పగింత

మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న బిహార్‌ యువకుడిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అన్నం సేవాశ్రమం నిర్వాహకుడు అన్నం శ్రీనివాసరావు తెలిపారు.

Published : 17 Apr 2024 02:59 IST

తల్లి, భార్యకు బబ్లూను అప్పగిస్తున్న శ్రీనివాసరావు, ఎస్‌ఐ సంతోష్‌, ఏఎస్సై జ్యోతి

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న బిహార్‌ యువకుడిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అన్నం సేవాశ్రమం నిర్వాహకుడు అన్నం శ్రీనివాసరావు తెలిపారు. బబ్లూకుమార్‌(27) ఖమ్మం నగరం శ్రీరాంనగర్‌ ప్రాంతంలో తిరుగుతూ ప్రజలను ఇబ్బంది పెడుతుండగా గుర్తించిన పోలీసులు ఏప్రిల్‌ 4న తమ ఆశ్రమంలో చేర్పించారని అన్నం తెలిపారు. అతనికి మమత ఆసుపత్రిలో మానసిక వైద్యం చేయించామని, కోలుకున్న తర్వాత వివరాలు చెప్పాడన్నారు. బిహార్‌ నుంచి వచ్చిన తల్లి ప్రమీలాదేవి, భార్య అంజలికుమారి, సోదరుడు శ్రీరామ్‌లకు బబ్లూని పోలీసుల సమక్షంలో మంగళవారం అప్పగించామని శ్రీనివాసరావు వివరించారు. ఎస్‌ఐ సంతోష్‌, ఏఎస్‌ఐ జ్యోతి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని