logo

32 కిలోల గంజాయి స్వాధీనం

గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులను ఖమ్మం ఒకటో పట్టణ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

Published : 30 Apr 2024 04:47 IST

పట్టుబడిన నిందితులతో పోలీసులు

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులను ఖమ్మం ఒకటో పట్టణ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.8 లక్షల విలువ చేసే 32 కిలోల గంజాయి, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ కథనం ప్రకారం... మిశాల్‌ అనే వ్యక్తి సూచన మేరకు సికింద్రాబాద్‌లో ఉంటున్న సంజయ్‌సింగ్‌కు గంజాయి అప్పగించేందుకు ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా బోమిక గ్రామానికి చెందిన భరత్‌ అలియానా, పద్మతుల అలియానా దంపతులు విశాఖపట్నం నుంచి రైలులో బయలుదేరారు. ఎవరికి అనుమానం రాకుండా సోమవారం ఖమ్మం రైల్వే స్టేషన్‌లో దిగి మరో రైలులో సికింద్రాబాద్‌ వెళ్లేందుకు సమీపంలో ఉన్న దేవాలయం వద్ద వేచి ఉన్నారు. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని తనిఖీ చేసి గంజాయిని గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని