logo

అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం

అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్‌ సాగు చేశారు.

Published : 19 Apr 2024 02:58 IST

అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్‌ సాగు చేశారు. ప్రతి సంవత్సరం బోర్లు ద్వారా, వాగులో ప్రవహించే నీటిని పంటలకు పెట్టేవారు. ప్రస్తుతం బోర్ల నుంచి నీళ్లు రావడం లేదు. మిట్టపల్లివాగు(గంగదేవిపాడువాగు)లో అక్కడక్కడ ఊట వస్తున్న నీటిని ఒక్క దగ్గర గుంతలోకి మళ్లించి అక్కడి నుంచి మోటారు ఏర్పాటు చేసి సుదూరం పైపులైను వేసి పామాయిల్‌ పంటకు తరలిస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు మండు వేసవిలో అన్నదాతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

తల్లాడ, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని