logo

తల తాకట్టు పెట్టయినా రుణమాఫీ: తుమ్మల

తల తాకట్టు పెట్టయినా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆగస్టు 15లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందని వ్యవసాయ శాఖామంతి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Published : 01 May 2024 02:17 IST

దమ్మపేట, న్యూస్‌టుడే: తల తాకట్టు పెట్టయినా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆగస్టు 15లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందని వ్యవసాయ శాఖామంతి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అల్లిపల్లిలో ఆయిల్‌పాం రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్‌ ఇంట్లో అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలసి మంత్రి తుమ్మల పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయటమే తన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 69 లక్షల మంది రైతుల్లో 66లక్షల మందికి రైతుబంధు పూర్తి చేశామన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఖమ్మం అభ్యర్థి రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఈ మెజార్టీని చూసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మిగిలిన పార్టీలు పోటీకి భయపడతాయన్నారు. పార్టీ బలోపేతానికి మరికొంతమందిని చేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాత, కొత్త కాంగ్రెస్‌ నాయకులతో కలపి మండలాలు, నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను కలుస్తానని, కార్యకర్తలు సంయమనంతో సహకరించాలన్నారు. రఘురాంరెడ్డి గెలుపునకు కృషి చేస్తామని కార్యకర్తలు, నాయకులు మంత్రి తుమ్మల, ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. నాయకులు ఆలపాటి రామచంద్రప్రసాద్‌, మెగళ్లపు చెన్నకేశవులు, బండి భాస్కర్‌, జ్యేష్ఠ సత్యనారాయణ చౌదరి, గుత్తా రాజా, అమర్‌నాథ్‌, కరుటూరి కృష్ణ, కొయ్యల అచ్యుతరావు, కేవీ సత్యనారాయణ, అడపా రాంబాబు, కూకలకుంట రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని