logo

పదిలో మెరిశారు

పదోతరగతి ఫలితాల్లో ఉభయ జిల్లాల్లోని ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటారు. అనేక మంది 10 జీపీఏ సాధించారు.

Published : 01 May 2024 02:24 IST

ఖమ్మం విద్యావిభాగం, కొత్తగూడెం విద్యావిభాగం, వైరా, న్యూస్‌టుడే

పదోతరగతి ఫలితాల్లో ఉభయ జిల్లాల్లోని ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటారు. అనేక మంది 10 జీపీఏ సాధించారు.

 


న్యూవిజన్‌ జోరు

విద్యార్థులతో న్యూవిజన్‌ ఛైర్మన్‌ సీహెచ్‌జీకే ప్రసాద్‌, డైరెక్టర్‌ గోపీచంద్‌, అకడమిక్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ తదితరులు

న్యూవిజన్‌ విద్యాసంస్థ (ఖమ్మం)ల విద్యార్థులు ఉత్తమ గ్రేడ్‌ పాయింట్లు సాధించినట్లు ఛైర్మన్‌ సీహెచ్‌జీకే ప్రసాద్‌   తెలిపారు. 48 మంది విద్యార్థులు 10 జీపీఏ, 61 మంది 9.8 జీపీఏ, 57 మంది 9.7 జీపీఏ సాధించారని చెప్పారు. నూరు శాతం ఉత్తీర్ణత సాధించామన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను విద్యాసంస్థల ఛైర్మన్‌ సీహెచ్‌జీకే ప్రసాద్‌తో పాటు డైరెక్టర్‌ సీహెచ్‌.గోపీచంద్‌, అకడమిక్‌ డైరెక్టర్‌ సీహెచ్‌.కార్తీక్‌, ప్రిన్సిపల్స్‌ ఎండీ ఆబాద్‌ఆలీ,    జేవీ మైఖేల్‌ అభినందించారు.


శ్రీచైతన్య జయకేతనం

విద్యార్థులతో మల్లెంపాటి శ్రీవిద్య, ప్రిన్సిపల్స్‌ తదితరులు

శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు ఛైర్మన్‌ మల్లెంపాటి శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య తెలిపారు. 557 మంది 10 జీపీఏ, 1,147 మంది 9.8   జీపీఏ, 1,702 మంది 9.7జీపీఏ సాధించారని వెల్లడించారు. ఈ ఫలితాల్లో ఖమ్మం జోన్‌లోని శ్రీచైతన్య స్కూల్స్‌ విద్యార్థులు 84 మంది, వరంగల్‌ జోన్‌లో 94 మంది, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జోన్‌లో 112 మంది, నిజామాబాద్‌, మెదక్‌ జోన్‌లో 98 మంది, మహబూబ్‌నగర్‌, నల్గొండ జోన్‌లో 147 మంది, వికారాబాద్‌ జోన్‌లో 22 మంది 10 జీపీఏ సాధించినట్లు వివరించారు. విద్యార్థులను ఛైర్మన్‌ శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య, ప్రిన్సిపల్‌్్స అభినందించారు.


హార్వెస్ట్‌ ప్రతిభ

విద్యార్థులతో ప్రిన్సిపల్‌ ఆర్‌.పార్వతిరెడ్డి

హార్వెస్ట్‌ విద్యాసంస్థ (ఖమ్మం)ల విద్యార్థులు సత్తా చాటారని కరస్పాండెంట్‌ పి.రవిమారుత్‌, ప్రిన్సిపల్‌ ఆర్‌.పార్వతిరెడ్డి తెలిపారు. ఎనిమిది మంది 10 జీపీఏ, తొమ్మిది మంది 9.8 జీపీఏ, పదకొండు మంది   9.7 జీపీఏ సాధించారని వెల్లడించారు. ప్రతిభ చాటిన విద్యార్థులను కరస్పాండెంట్‌ రవిమారుత్‌, ప్రిన్సిపల్‌ పార్వతిరెడ్డి అభినందించారు.


విన్‌ఫీల్డ్‌ విజయభేరి

విద్యార్థులతో డైరెక్టర్లు గద్దె పుల్లారావు, మన్నే కిశోర్‌కుమార్‌, పోలవరపు శ్రీకాంత్‌

విన్‌ఫీల్డ్‌ హైస్కూల్‌ (ఖమ్మం) విద్యార్థులు ప్రతిభ కనబ రిచారని డైరెక్టర్లు గద్దె పుల్లారావు, మన్నే కిశోర్‌కుమార్‌, పోలవరపు శ్రీకాంత్‌ తెలిపారు. ఎనిమిది మంది 10 జీపీఏ, ఎనిమిది మంది 9.8 జీపీఏ, ఏడుగురు 9.7 జీపీఏ సాధించారని వెల్లడించారు.  విద్యార్థులను పాఠశాల డైరెక్టర్లు గద్దె పుల్లారావు, మన్నే కిశోర్‌కుమార్‌, పోలవరపు శ్రీకాంత్‌   తదితరులు అభినందించారు.


త్రివేణి ప్రభంజనం

విద్యార్థులతో త్రివేణి-కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్‌ యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్‌ పి.రాజేంద్రప్రసాద్‌

త్రివేణి విద్యాసంస్థ(ఖమ్మం)ల విద్యార్థులు సత్తా చాటారని డైరెక్టర్‌ గొల్లపూడి వీరేంద్ర చౌదరి తెలిపారు. 71 మంది 10 జీపీఏ, 9.8 జీపీఏ, 538మంది 9.7జీపీఏ సాధించారని వివరించారు. విద్యార్థులను డైరెక్టర్‌ వీరేంద్రచౌదరితో పాటు త్రివేణి-కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్‌ యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్‌ పి.రాజేంద్రప్రసాద్‌, సీఆర్‌ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ, వైస్‌ ప్రిన్సిపాల్స్‌ స్వప్న, ముస్తాఫా, అశోక్‌ అభినందించారు.


సర్వజ్ఞ సత్తా

విద్యార్థులతో పాఠశాల డైరెక్టర్లు ఆర్‌వీ నాగేంద్రకుమార్‌, నీలిమ

సర్వజ్ఞ హైస్కూల్‌ (వీడీఓస్‌ కాలనీ, ఖమ్మం) విద్యార్థులు ప్రతిభ కనబరిచారని డైరెక్టర్లు ఆర్‌వీ నాగేంద్రకుమార్‌, నీలిమ తెలిపారు. ఒక్కో విద్యార్థి చొప్పున 10 జీపీఏ, 9.8 జీపీఏ, 9.7 జీపీఏ సాధించారని వెల్లడించారు. నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. వీరిని డైరెక్టర్లు నాగేంద్రకుమార్‌, నీలిమ అభినందించారు.


మధు విద్యాలయం

మధు విద్యాలయం(వైరా) విద్యార్థులు ప్రతిభ చాటారని ఛైర్మన్‌ మల్లెంపాటి రంజిత్‌, కరస్పాండెంట్‌ రంజిత్‌, ఉపాధ్యక్షుడు ప్రసాద్‌, కోశాధికారి నర్మద, ప్రిన్సిపల్‌ రాంబాబు తెలిపారు. ఇద్దరు విద్యార్థులు 9.8 జీపీఏ, ఒక విద్యార్థిని 9.7 జీపీఏ సాధించారని వెల్లడించారు. విద్యార్థులను అభినందించారు.


రెజొనెన్స్‌ వీడీవోస్‌ కాలనీ

రెజొనెన్స్‌ (వీడీవోస్‌ కాలనీ, ఖమ్మం) పాఠశాల విద్యార్థులు సత్తా చాటారని డైరెక్టర్లు నీలిమ, ఆర్‌వీ నాగేంద్రకుమార్‌, కొండా శ్రీధర్‌రావు తెలిపారు. ముగ్గురు 10 జీపీఏ, పది మంది   9.8 జీపీఏ సాధించినట్టు వెల్లడించారు. విద్యార్థులను డైరెక్టర్లు నీలిమ, ఆర్‌వీ నాగేంద్రకుమార్‌, కొండా శ్రీధర్‌రావు, ప్రిన్సిపల్‌ గోపాలకృష్ణ అభినందించారు.


‘సెంచరీ’ స్కూల్‌ ప్రతిభ

జస్వంత్‌

సెంచరీ పాఠశాల (ఖమ్మం) విద్యార్థులు ప్రతిభ కనబరిచారని కరస్పాండెంట్‌ డీవీఎస్‌ ప్రభాకర్‌రావు తెలిపారు. డి.జస్వంత్‌ 10 జీపీఏ సాధించగా 20 మందికి పైగా విద్యార్థులు 9.0 జీపీఏ సాధించినట్టు వెల్లడించారు.  


గీతాంజలి అదరహో

గీతాంజలి విద్యానికేతన్‌(ఖమ్మం) విద్యార్థులు ప్రతిభ చాటారని కరస్పాండెంట్‌ టీవీ అప్పారావు, డైరెక్టర్లు పద్మ, అరుణ్‌కుమార్‌ తెలిపారు. ఐదుగురు 10 జీపీఏ, నలుగురు 9.8 జీపీఏ, నలుగురు 9.7 జీపీఏ సాధించారన్నారు. వీరిని కరస్పాండెంట్‌ అప్పారావు,  డైరెక్టర్లు పద్మ, అరుణ్‌కుమార్‌ అభినందించారు.


రెజొనెన్స్‌ శ్రీనగర్‌ కాలనీ

రెజొనెన్స్‌ శ్రీనగర్‌ కాలనీ (ఖమ్మం) పాఠశాల విద్యార్థులు సత్తా చాటారని డైరెక్టర్లు కొండా శ్రీధర్‌రావు, కొండా కృష్ణవేణి తెలిపారు. ఆరుగురు 10 జీపీఏ, ఎనిమిది మంది 9.8 జీపీఏ, 16 మంది 9.7 జీపీఏ సాధించారని వెల్లడించారు.  వీరిని డైరెక్టర్లు శ్రీధర్‌రావు, కృష్ణవేణి, ప్రిన్సిపల్‌ ఎం.ప్రసన్నరావు అభినందించారు.


న్యూఇరా విజయదుందుభి

విద్యార్థులతో న్యూఇరా డైరెక్టర్‌ పి.భూమేశ్వరరావు తదితరులు

న్యూఇరా విద్యాసంస్థ(ఖమ్మం) ల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ఛైర్మన్‌ ఐవీ రమణారావు, డైరెక్టర్‌ పి.భూమేశ్వరరావు తెలిపారు. ఇద్దరు 10 జీపీఏ, ఏడుగురు 9.8 జీపీఏ, ముగ్గురు    9.7 జీపీఏ సాధించారని చెప్పారు. వీరిని ఛైర్మన్‌ రమణారావు, డైరెక్టర్‌ భూమేశ్వరరావు అభినందించారు.


‘బీబీఎం’ విజయకేతనం

బీబీఎం పాఠశాల(నాయుడుపేట) విద్యార్థులు ప్రతిభ చూపినట్టు డైరెక్టర్‌ జి.కాంతారావు, కరస్పాండెంట్‌ నాగమణి తెలిపారు. ఇద్దరు 10 జీపీఏ, ఒకరు 9.8 జీపీఏ, ఇద్దరు 9.7 జీపీఏ సాధించారన్నారు. విద్యార్థులను డైరెక్టర్‌ జి.కాంతారావు, కరస్పాండెంట్‌ నాగమణి, ప్రిన్సిపల్‌ గోపాల్‌రావు అభినందించారు.


నిర్మల్‌ హృదయ్‌ జోరు

నిర్మల్‌ హృదయ్‌ స్కూల్‌(ఖమ్మం) విద్యార్థులు ప్రతిభ కనబరిచారని కరస్పాండెంట్‌ వంగా సాంబశివారెడ్డి తెలిపారు. నలుగురు 10 జీపీఏ, ఆరుగురు 9.8 జీపీఏ, 17 మంది 9.7 జీపీఏ సాధించారని వెల్లడించారు. వీరిని కరస్పాండెంట్‌ సాంబశివారెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు ఎ.పద్మజ, డైరెక్టర్‌ వంగా సుధాకర్‌రెడ్డి అభినందించారు.


శ్రీవిద్య సత్తా

శ్రీవిద్య స్కూల్‌ (లక్ష్మీదేవిపల్లి మండలం) విద్యార్థులు సత్తాచాటినట్లు సీఈఓ శ్రీచైతన్యకృష్ణ తెలిపారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ముగ్గురు 10 జీపీఏ, 13 మంది 9.8 జీపీఏ సాధించారని వెల్లడించారు. వీరిని విద్యాసంస్థల జీఎం శ్రీనరేశ్‌, ప్రిన్సిపల్‌ నిరుపమ, అకడమిక్‌ కో ఆర్డినేటర్‌ సీహెచ్‌ రమేశ్‌ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని