logo

వార్షిక మరమ్మతుల ప్రణాళికపై సమీక్ష

పాల్వంచ కేటీపీఎస్‌ ఐదు, ఆరు దశల కర్మాగారాన్ని జెన్కో డైరెక్టర్‌ బి.లక్ష్మయ్య మంగళవారం సందర్శించారు. కేటీపీఎస్‌లోని బాయిలర్‌, యాష్‌ ప్లాంట్‌, యూసీబీ, కోల్‌ మిల్‌, టర్బైన్‌ తదితర విభాగాలను పరిశీలించి.. అక్కడి వివరాలు ఏరియా ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు.

Published : 01 May 2024 02:28 IST

ఆరో దశ యాష్‌ప్లాంట్‌లో అధికారులతో మాట్లాడుతున్న డైరెక్టర్‌ లక్ష్మయ్య

పాల్వంచ, న్యూస్‌టుడే: పాల్వంచ కేటీపీఎస్‌ ఐదు, ఆరు దశల కర్మాగారాన్ని జెన్కో డైరెక్టర్‌ బి.లక్ష్మయ్య మంగళవారం సందర్శించారు. కేటీపీఎస్‌లోని బాయిలర్‌, యాష్‌ ప్లాంట్‌, యూసీబీ, కోల్‌ మిల్‌, టర్బైన్‌ తదితర విభాగాలను పరిశీలించి.. అక్కడి వివరాలు ఏరియా ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పదో యూనిట్‌లో చేపట్టాల్సిన వార్షిక మరమ్మతులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెలలో చేపట్టే మరమ్మతుల నిర్వహణ పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్య ఇంజినీరు మేక ప్రభాకర్‌రావును డైరెక్టర్‌ ఆదేశించారు.     సమావేశంలో ఎస్‌ఈలు, డీఈలు, ఈఈ, ఏడీఈలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని