logo

సంక్షేమం పేరుతో అప్పులమయం

పదేళ్లు పాలించిన భారాస అధినేత కేసీఆర్‌ సంక్షేమం, అభివృద్ధి పేరుతో తెలంగాణను అప్పులపాలు చేశారని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Published : 01 May 2024 02:17 IST

వైరా, కొణిజర్ల, న్యూస్‌టుడే: పదేళ్లు పాలించిన భారాస అధినేత కేసీఆర్‌ సంక్షేమం, అభివృద్ధి పేరుతో తెలంగాణను అప్పులపాలు చేశారని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కోరుతూ మంగళవారం రాత్రి వైరా, కొణిజర్లలో రోడ్‌షో నిర్వహించారు. కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతూ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్‌ పాలన కొనసాగుతుందని ఇచ్చిన ప్రతి ఎన్నికల హామీని నెరవేర్చుతున్నామన్నారు. అధికారం కోల్పోయిన కేసీఆర్‌ తట్టుకోలేక రోడ్‌షోలు, బస్సు యాత్రల పేరుతో మోసం చేసేందుకు వస్తున్నా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. పార్టీ అభ్యర్థి  రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌, మార్క్‌ఫెడ్‌ మాజీ ఉపాధ్యక్షుడు బొర్రా రాజశేఖర్‌, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, పురఛైర్మన్‌ సూతకాని జైపాల్‌, టీపీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని