logo

వర్షాకాలం రాకముందే పనులు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల

వర్షాకాలం సమీపించకముందే మున్నేరు కేబుల్‌ వంతెన సీసీ పనులు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ఆదేశించారు.

Published : 20 Apr 2024 02:17 IST

తీగల వంతెన ప్లాన్‌ను పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: వర్షాకాలం సమీపించకముందే మున్నేరు కేబుల్‌ వంతెన సీసీ పనులు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ఆదేశించారు. ఖమ్మంలో తీగల వంతెన నిర్మాణ సంస్థ ప్రతినిధులు శుక్రవారం మంత్రిని కలిసి నిర్మాణ పనులపై చర్చించారు. వంతెన మ్యాప్‌ను పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు. నీటి పారుదలశాఖ అధికారుల సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. పాత వంతెనను  సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతంగా రూపొందించాలని సూచించారు. నిర్మాణ సమయంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పోలీసులతో చర్చించాలన్నారు. మున్నేరుకు ఇరువైపులా రిటర్నింగ్‌ వాల్‌ నిర్మాణం నేపథ్యంలో ఆయా  అధికారులు, సంస్థ ప్రతినిధులను సమన్వయపరుచుకుంటూ పనులు చేపట్టాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని