logo

తడిసిన ధాన్యం కొనుగోలుకు డిమాండ్‌

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో వరి కుప్పల్లో నీరు చేరింది. పలుచోట్ల ఆరబోసిన ధాన్యం తడవడంతో రంగు మారాయని రైతు సంఘం తూర్పు కృష్ణా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు అన్నారు. స్థానిక కార్యాలయంలో ఆదివారం

Published : 17 Jan 2022 02:06 IST

మాట్లాడుతున్న నాగేశ్వరరావు, చిత్రంలో రైతు సంఘ ప్రతినిధులు

బంటుమిల్లి, న్యూస్‌టుడే: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో వరి కుప్పల్లో నీరు చేరింది. పలుచోట్ల ఆరబోసిన ధాన్యం తడవడంతో రంగు మారాయని రైతు సంఘం తూర్పు కృష్ణా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు అన్నారు. స్థానిక కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అకాల వర్షం కారణంగా అపరాల సాగుకు ప్రారంభ దశలోనే ఆటంకం ఏర్పడిందని, సాగు చేసే వారికి 50శాతం రాయితీతో క్రిమిసంహారక మందులు అందించాలని కోరారు. సంఘ ప్రతినిధులు లంకదాసుల ఆజయ్‌ఘోష్‌, సుజ్ఞానం నాంచారయ్య, వినయ్‌, తెనాలి బాలయోగి, అర్జా కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని