logo

చేనేత వస్త్రాల అమ్మకాలకు కార్యాచరణ

సహకార చేనేత కార్మికులకు చేయూతనందించాలని ఆప్కో నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సహకార సంఘాల్లో పెద్దఎత్తున వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో రూ.15 కోట్ల

Published : 21 Jan 2022 03:11 IST

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: సహకార చేనేత కార్మికులకు చేయూతనందించాలని ఆప్కో నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సహకార సంఘాల్లో పెద్దఎత్తున వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో రూ.15 కోట్ల నిల్వలు ఉన్నట్లు ఆప్కో సమాచారం సేకరించింది. వీటి అమ్మకాలకు చేనేత, జౌళి శాఖ డైరెక్టర్‌, ఆప్కో ఎండీ సి.నాగమణి ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. ఆప్కో మార్కెటింగ్‌ సిబ్బందితో సంఘాల్లోని వస్త్ర నిల్వలకు సంబంధించి ప్రత్యేక క్యాటలాగ్‌ తయారు చేయించారు. దీని ఆధారంగా ముంబయి, పుణే ప్రాంతాల్లో టోకున మార్కెటింగ్‌ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి హోల్‌సేల్‌ వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పెడన, పోలవరం, కప్పలదొడ్డి, మంగళగరి, తూర్పు గోదావరి జిల్లాల చేనేత రకాలను ప్రత్యేకంగా మార్కెటింగ్‌ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. చేనేత చీరలపై వినూత్నంగా కలంకారీ చేతి, తెర ముద్రణ చేయించి విక్రయాలు చేయాలని యోచిస్తున్నట్లు ఆప్కో సీనియర్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ లేళ్ల రమేష్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని