logo

కూలీలకు ఇబ్బందులు లేకుండా చర్యలు

జిల్లాలో ఉపాధి కూలీలకు పనుల కల్పన, వేతనాల చెల్లింపు తదితర విషయాల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ అమర్‌నాథ్‌రెడ్డి చెప్పారు. జిల్లాలో గత కొన్ని రోజులుగా నేషనల్‌ లెవల్‌ మానిటరింగ్‌ కమిటీ ప్రతినిధులు

Published : 23 Jan 2022 02:16 IST
మాట్లాడుతున్న డ్వామా పీడీ అమర్‌నాథ్‌రెడ్డి

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లాలో ఉపాధి కూలీలకు పనుల కల్పన, వేతనాల చెల్లింపు తదితర విషయాల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ అమర్‌నాథ్‌రెడ్డి చెప్పారు. జిల్లాలో గత కొన్ని రోజులుగా నేషనల్‌ లెవల్‌ మానిటరింగ్‌ కమిటీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఉపాధి పనులు, గృహ నిర్మాణ పనులపై పరిశీలన చేశారు. ఉపాధి పనుల విషయంలో కూలీలకు న్యాయం జరుగుతోందా? లేదా? ఏవైనా అక్రమాలు జరిగాయా.. హౌసింగ్‌ లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు తదితర విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలు రూపొందించారు. వీటిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటన పూర్తి చేసుకున్న కమిటీ ప్రతినిధులతో పీడీ శనివారం సమావేశమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని