logo

ముంచెత్తిన వరద

ఓ మోస్తరు వర్షం కురిసినా జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయం అవుతాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తాయి. బుధవారం గంట సేపు కురిసిన వర్షానికి వీధులన్నీ వంకల్లా మారాయి.

Published : 29 Sep 2022 03:42 IST

సంజీవనగర్‌ గేట్‌లో నిలిచిపోయిన వాహనాలు

ఓ మోస్తరు వర్షం కురిసినా జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయం అవుతాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తాయి. బుధవారం గంట సేపు కురిసిన వర్షానికి వీధులన్నీ వంకల్లా మారాయి. నంద్యాల ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోకి వర్షపు నీరు చేరింది. ఎమ్మారై, సీటీ స్కానింగ్‌ కేంద్రాలు మడుగులా మారడంతో సిబ్బంది నీటిని బయటికి తోడిపోయాల్సి వచ్చింది. ఐసీయూ వార్డు పక్కన వరండాలో నీరు నిలవడంతో తిరిగేందుకు రోగులు ఇబ్బందులు పడ్డారు. రక్తపరీక్షల ల్యాబ్‌ కారడంతో సిబ్బందికి అవస్థలు తప్పలేదు. మరోవైపు పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపర్చాల్సిన పురపాలక కార్యాలయాన్నే వాననీరు ముంచెత్తింది. ఆవరణలో మోకాల్లోతు నీరు చేరడంతో సిబ్బంది,  కార్యాలయానికి వచ్చిన ప్రజలు గేటు వద్దే ఆగిపోవాల్సిన దుస్థితి తలెత్తింది. స్థానిక సంజీవనగర్‌ గేటు, పద్మావతీనగర్‌, నూనెపల్లె, సాయిబాబానగర్‌, రైల్వే స్టేషన్‌ రోడ్డులో మురుగుతో కూడిన వర్షపునీరు రహదారులపై ప్రవహించడంతో వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. సాయిబాబానగర్‌లో ఇళ్లలోకి నీరు చేరడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. గంటసేపు కురిసిన వర్షానికే పట్టణం ఇలా మారితే ఇక భారీ వర్షాలు పడితే పరిస్థితేంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
- న్యూస్‌టుడే, నంద్యాల పాతపట్టణం, నంద్యాల బొమ్మలసత్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని