logo

రూ.16.42 కోట్ల వడ్డీ రాయితీ జమ

పంట పెట్టుబడుల కోసం రూ.లక్షలోపు రుణం తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లించిన రైతులకు ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇస్తోందని కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలాని సామూన్‌ తెలిపారు.

Published : 29 Nov 2022 02:19 IST

జంబో చెక్కును పంపిణీ చేస్తున్న కలెక్టర్‌, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ తదితరులు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : పంట పెట్టుబడుల కోసం రూ.లక్షలోపు రుణం తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లించిన రైతులకు ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇస్తోందని కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలాని సామూన్‌ తెలిపారు. పథకం కింద జిల్లాలోని 81,294 మందికి రూ.16.42 కోట్లను సీఎం రైతుల ఖాతాలకు జమ చేసినట్లు వెల్లడించారు. అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి 5,272 మంది రైతులకు రూ.4.29 కోట్ల పరిహారాన్ని జమ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ పీపీ నాగిరెడ్డి, జేడీఏ మోహన్‌రావు, ఉద్యానవన శాఖ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని