logo

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

ఆదోనిలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వినోద్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఏస్పీ మాట్లాడారు.

Updated : 24 Mar 2023 19:38 IST

ఆదోని మార్కెట్‌: ఆదోనిలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వినోద్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఏస్పీ మాట్లాడారు. కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో ఓ కేసులో పట్టుబడిన వీరిని విచారణ నిమిత్తం అక్కడి పోలీసుల సహకారంతో ఆదోనికి తీసుకొచ్చారు. దీంతో తమ శైలిలో విచారించగా ఆదోనితో పాటు కర్నూలు జిల్లాలో నమోదైన 8కేసుల్లో నిందితులుగా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి అరకిలో బంగారు ఆభరణాలు, 450గ్రాముల వెండి ఆభరణాలతో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వీరు నకిలీ స్వచ్ఛభారత్‌ కార్డులను ముద్రించుకొని పురపాలక పారిశుద్ధ్య కార్మికులుగా నమ్మిస్తూ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఐ శ్రీరామ్‌, ఎస్సై తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని