logo

తెదేపా ఆవిర్భావ పండగ

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కేకు కోసి పంచిపెట్టారు.

Published : 30 Mar 2023 02:43 IST

కర్నూలు సచివాలయం: కర్నూలు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కేకు కోసి పంచిపెట్టారు. ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే భావనతో ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించారు.. పేదల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే తెదేపా అధికారంలోకి రావాలన్నారు.

కల్లూరు గ్రామీణం: కల్లూరులో కేక్‌ కోస్తున్న నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకట్‌రెడ్డి, పాణ్యం బాధ్యులు గౌరు చరితారెడ్డి

మంత్రాలయం: నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ

తెదేపా జెండాను ఎగురవేస్తున్న రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావుయాదవ్‌

ఎమ్మిగనూరు: తెదేపా జెండాను ఎగురవేస్తున్న నాయకులు

ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద తెదేపా జెండా ఆవిష్కరణలో నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని