logo

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి క్షమాపణలు చెప్పి పర్యటించండి

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్‌ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

Published : 29 Mar 2024 06:17 IST

తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి

 

 మాట్లాడుతున్న ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్‌ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. గురువారం ఆయన ఎమ్మిగనూరులో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెదేపా హయాంలో పట్టణ ప్రజలకు తాగునీరందించేందుకు రూ.146 కోట్లతో చేపట్టిన పనులను వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిపివేశారని పేర్కొన్నారు. చేనేత పార్కు మంజూరు చేసి ఉంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభించేదన్నారు. గోనెగండ్లలో తాగునీటి పథకాన్ని రూ.13 కోట్లతో మంజూరు చేస్తే మళ్లీ శంకుస్థాపన చేసి అసమర్థతను చాటుకున్నారని ఎద్దేవా చేశారు. రంజాన్‌ తోఫా, మసీదుల నిర్మాణానికి నిధులు విడుదల చేయిస్తే వాటిని వెనక్కి పంపించారన్నారు. జిల్లాలో గుండ్రేవుల, ఆర్డీఎస్‌, వేదవతి వంటి ప్రాజెక్టులకు పైసా నిధులు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ సమావేశంలో తెదేపా నాయకులు సుందరరాజు, కొండయ్యచౌదరి, మాధవ్‌రావు దేశాయి, బడేసాబ్‌, నరసింహులు, ఉసేన్‌సాబ్‌, జగదీశ్‌ పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని