logo

రానున్న ఎన్నికల్లో తెదేపాదే అధికారం

బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెదేపా పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.

Published : 29 Mar 2024 16:09 IST

మంత్రాలయం గ్రామీణం: బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెదేపా పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. మంత్రాలయంలో తెదేపా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను తప్పకుండా రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అందరూ పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని