logo

నామపత్రాల సందడి

ఆదోని నియోజకవర్గ భాజపా భాజపా అభ్యర్థిగా డాక్టరు పార్థసారథి శుక్రవారం నామపత్రం దాఖలు చేశారు. ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని నామినేషన్‌ కేంద్రంలో ఎన్నికల అధికారి శివ్‌నారయణశర్మకు తన నామపత్రాన్ని అందజేశారు.

Published : 20 Apr 2024 05:25 IST

ఆదోని గ్రామీణం, ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ఆదోని నియోజకవర్గ భాజపా భాజపా అభ్యర్థిగా డాక్టరు పార్థసారథి శుక్రవారం నామపత్రం దాఖలు చేశారు. ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని నామినేషన్‌ కేంద్రంలో ఎన్నికల అధికారి శివ్‌నారయణశర్మకు తన నామపత్రాన్ని అందజేశారు. మధ్యాహ్నం 12.15 గంటలకు అభ్యర్థి పార్థసారథి, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, భాజపా రాష్ట్ర పొలిట్‌ బ్యూరో సభ్యుడు చంద్రమౌళి, తెదేపా సీనియర్‌ నాయకులు భాస్కర్‌రెడ్డి, గుడిసె కృష్ణమ్మ, శ్రీకాంత్‌రెడ్డి, రామచంద్ర, అప్సర్‌బాషాతో కలిసి నామినేషన్‌ కేంద్రానికి హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా చేరుకున్నారు. నామినేషన్‌ కేంద్రంలోకి ఐదుగురే వెళ్లాలని పోలీసులు నిబంధన విధించారు. దీంతో భాజపా పొలిట్‌బ్యూరో సభ్యుడు చంద్రమౌళి, తెదేపా నాయకుడు శ్రీకాంత్‌రెడ్డిని లోపలికి వెళ్లకుండా తాలుకా ఎస్సై ఎర్రిస్వామి అడ్డుకున్నారు. కొద్దిసేపటికి లోపలికి పంపడంతో సమస్య సద్దుమణిగింది. ఆ తర్వాత ఎన్నికల నిబంధనల మేరకు కేవలం నామినేషన్‌ దాఖలుకు ఐదుగురు మాత్రమే ఉండాలని ఎన్నికల అధికారి చెప్పడంతో అభ్యర్థితో పాటు మీనాక్షినాయుడు, అప్సర్‌బాషా, న్యాయవాదులు శ్రీరాములు, వై.ఆర్‌.మల్లికార్జున మినహా మిగిలిన వారు బయటకు వచ్చేశారు.

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పత్తికొండ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కేఈ శ్యాంబాబు ఎన్నికల అధికారి నీలాపు రామలక్ష్మికి నామపత్రాలు దాఖలు చేశారు.

పత్తికొండ, పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పత్తికొండ వైకాపా అభ్యర్థిగా కంగాటి శ్రీదేవి నామినేషన్‌ వేశారు. శుక్రవారం తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి ఆమె స్థానిక రహదారులు భవనాల శాఖ అతిథి గృహం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లారు. కర్నూలు పార్లమెంటు నియోజవకర్గ వైకాపా అభ్యర్థి బీవై రామయ్య, పత్తికొండ మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌రెడ్డి, తదితరులతో కలిసి ఆమె ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రామలక్ష్మికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. శ్రీదేవి తన నామినేషన్‌ పత్రం దాఖలు చేసేందుకు ముందు సెంటిమెంట్గా.. స్వగ్రామమైన చెరుకులపాడుకు వెళ్లి, తన భర్త దివంగత నారాయణరెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించి పత్తికొండకు బయల్దేరి వెళ్లారు.

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఆలూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షి శుక్రవారం నామపత్రాలను దాఖలు చేశారు. కొంతమంది అనుచరులతో కలిసి వెళ్లి సాదాసీదాగా నామినేషన్‌ వేశారు. ఈ నెల 23న మరోసారి నామినేషన్‌ వేయనున్నట్లు తెలిపారు. వైకాపా నాయకులు శశికళ, ఆలూరు జడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్‌, న్యాయవాదులు లక్ష్మీకాంత్‌, ఆనంద్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని