logo

చిన్నారెడ్డి కాదు.. మేఘారెడ్డి

వనపర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది.

Published : 07 Nov 2023 04:30 IST

వనపర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి మార్పు

వనపర్తి, న్యూస్‌టుడే: వనపర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. అధిష్ఠానం ఈ స్థానానికి తొలుత చిన్నారెడ్డి పేరును ఖరారు చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అభ్యర్థి మార్పు అనివార్యం కావడంతో చివరికి మేఘారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖాయం చేశారు. తొలి జాబితాలోనే వనపర్తి టిక్కెట్‌ను చిన్నారెడ్డికి కేటాయించారు. అయితే గత మూడు రోజులుగా బి-ఫాం ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ప్రకటించిన మూడో జాబితాలో వనపర్తి అభ్యర్థి మార్పిడి జరిగింది. తాజాగా పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి పేరును ఖరారు చేసింది. అయితే చిన్నారెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. పలు మండలాలు తిరిగారు.

రాజకీయ నేపథ్యం: 2003 నుంచి 2014 వరకు తెదేపాలో ఉన్నారు. 2015లో భారాసలో చేరారు. ఆరేళ్లకు పైగా పార్టీ మండల అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో ఎంపీపీగా ఎన్నికయ్యారు. కొన్నాళ్లుగా మంత్రి నిరంజన్‌రెడ్డితో విభేదించిన ఆయన 2023, మార్చి 9న భారాసకు రాజీనామా చేశారు. ఆగస్టులో మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని