logo

తాత్కాలిక ఉద్యోగాల పేరిట వల

సిద్దిపేట జిల్లాలో సైబర్‌ నేరాలు నిత్యకృత్యంగా మారాయి. తాత్కాలిక ఉద్యోగాల పేరిట నేరగాళ్లు విసిరిన వలలో ఇద్దరు బాధితులుగా మారారు.

Updated : 17 Apr 2024 06:00 IST

సైబర్‌ ఉచ్చుకు చిక్కిన ఇద్దరు

సిద్దిపేట, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లాలో సైబర్‌ నేరాలు నిత్యకృత్యంగా మారాయి. తాత్కాలిక ఉద్యోగాల పేరిట నేరగాళ్లు విసిరిన వలలో ఇద్దరు బాధితులుగా మారారు. రెండు వేర్వేరు ఘటనలపై సిద్దిపేట సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో కేసులు నమోదయ్యాయి. పోలీసు కమిషనర్‌ అనూరాధ మంగళవారం తెలిపిన వివరాలు.. వర్గల్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కు సందేశం రాగా స్పందించాడు. ఆ తర్వాత సంప్రదింపులు మొదలయ్యాయి. హోటల్‌లో తాత్కాలిక ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికాడు. ఈ క్రమంలో సూచించిన హోటల్‌కు ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ ఇవ్వాలంటూ టెలీగ్రామ్‌ యాప్‌నకు పంపించిన టాస్కులకు ప్రతిస్పందించాడు. పెట్టుబడి పెట్టాలని సూచించగా నమ్మిన బాధితుడు ప్రారంభంలో కొంత సొమ్ము ఆన్‌లైన్‌లో పంపించగా లాభం చేకూరింది. వివిధ దశల్లో రూ.3,01,500 పెట్టుబడి పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత సదరు లింకును చూడగా బ్లాక్‌ కావడంతో మోసపోయినట్లుగా గ్రహించి టోల్‌ ఫ్రీ నం. 1930కి ఫిర్యాదు చేశారు. దీంతో రూ.88 వేలు ఫ్రీజ్‌ అయ్యాయి. సిద్దిపేటకు చెందిన మరో వ్యక్తికి గుర్తుతెలియని నేరగాడు ఐబీఎం కంపెనీ ప్రతినిధిగా పరిచయం చేసుకొని పార్ట్‌టైం ఉద్యోగం పేరిట వల విసిరాడు. అందుకు ఆరంభ రుసుము కొంత చెల్లించాలని సూచించగా.. రూ.1,33,500 పంపించాడు. ఆ తర్వాత ఫోన్‌ చేయగా స్పందన లేకపోవడంతో ఫిర్యాదు చేశారు. ఆయా ఘటనలపై ఏసీపీ శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి పరిశోధిస్తున్నట్లు సీపీ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని