logo

ఓటర్లకు చేరువ

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల సంఘం షెడ్యూలుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది.

Published : 23 Apr 2024 01:48 IST

పెరిగిన పోలింగ్‌ కేంద్రాలు

ఆదర్శ పోలింగ్‌ కేంద్రం(పాతచిత్రం)

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల సంఘం షెడ్యూలుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 25 వరకు స్వీకరించనున్నారు. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కొత్త పోలింగ్‌ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు కేంద్రాల్లో వసతుల కల్పనపై దృష్టి సారించారు.

వసతుల కల్పనకు ప్రాధాన్యం

జిల్లాలో 5 నియోజకవర్గాల్లో కలిపి ప్రస్తుతం 1,616 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో వీటి సంఖ్య 1,467 మాత్రమే. కొత్తగా 149 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఓటర్లకు సౌకర్యవంతంగా మారింది. కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో దివ్యాంగులు, వయోవృద్ధులు, యువత, మహిళలకు ప్రత్యేక కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాల్లో వసతులపై నోడల్‌ అధికారి సోమేశ్వర్‌రావు ఆధ్వర్యంలో పరిశీలిస్తూ జిల్లా ఎన్నికల అధికారికి ఎప్పటికప్పుడు నివేదిక అందజేస్తున్నారు.

ఓటు సద్వినియోగంపై..

అర్హులందరూ ఓటరుగా నమోదయ్యేలా ఇటీవల చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో కొత్తగా ఓటు కోసం 73,702 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం వీరిలో అర్హులందరికీ ఈ ఎన్నికల్లోనే ఓటు హక్కు కల్పించనున్నారు. ఓటు హక్కు ఉన్నవారందూ ఓటింగ్‌లో పాల్గొనేలా చైతన్య కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం నిర్వహిస్తోంది. నియోజకవర్గ కేంద్రాల్లో ఓటరు చైతన్య ర్యాలీలను నిర్వహించారు. సమర్థులనే ఎన్నుకునేలా ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు కళాజాత ప్రదర్శనలు సైతం ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని