logo

సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా

భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్‌లోనే సాధ్యమైంది.

Published : 24 Apr 2024 03:00 IST

2014లో నామినేషన్‌ సమర్పిస్తున్న కేసీఆర్‌

భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్‌లోనే సాధ్యమైంది. 2014లో మెదక్‌ నుంచి ఎంపీగా, గజ్వేల్‌ నుంచి ఎమ్మెల్యేగా కేసీఆర్‌ బరిలోకి దిగారు. మెదక్‌ లోక్‌సభలో తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శ్రావణ్‌కుమార్‌రెడ్డిపై ఆయన 3,97,029 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికలతో పాటు 2006, 2008 ఉప ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి, 2009లో మహబూబ్‌నగర్‌ నుంచి కేసీఆర్‌ ఎంపీగా గెలుపొందారు. ఐదు సార్లు ఎంపీగా గెలిచిన కేసీఆర్‌కుకు మెదక్‌లో దక్కిన ఆధిక్యమే అత్యధికం కావడం విశేషం. మెదక్‌ లోక్‌సభ స్థానానికి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో పాటు ఎక్కువ ఓట్లు సాధించిన రికార్డు కేసీఆర్‌ పేరిటే ఉండటం గమనార్హం.

న్యూస్‌టుడే, మెదక్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని